Sunday, December 1, 2024

మాదాపూర్‌లో భారీగా గంజాయి పట్టివేత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. డ్రగ్స్ ముఠా విచ్చలవిడిగా రెచ్చిపోతోంది. అక్రమంగా గంజాయిని సరఫరా చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం మాదాపూర్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. భారీగా గంజాయి పట్టిబడింది.

గంజాయిని తరలిస్తున్న కారును పోలీసులు చెక్ చేయగా.. డిక్కీలో రహస్య బాక్స్ ఏర్పాటు చేసి తరలిస్తున్న గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తీసుకొస్తున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News