Monday, December 23, 2024

ఓటర్ల ఖాతాలోకి కోమటిరెడ్డి కోట్లు

- Advertisement -
- Advertisement -

రాజగోపాల్ రెడ్డి కంపెనీ ‘సుశీ ఇన్‌ఫ్రా’ నుంచి భారీగా నగదు బదిలీ వ్యాపార
సంబంధం లేని సంస్థలకూ ట్రాన్స్‌ఫర్ శనివారం ఒక్కరోజే రూ.కోటి మూడు
రోజుల వ్యవధిలో రూ.5.22కోట్లు జమ ఎన్నికల సంఘానికి టిఆర్‌ఎస్ ఫిర్యాదు

మన తెలంగాణ/హైదరాబాద్: ఓటర్లను డబ్బులు పంచేందు కు బిజెపి అభ్యర్ధి రాజగోపాల్‌రెడ్డి అక్రమ పద్దతిలో ఆ పార్టీ నా యకుల బ్యాంకు అకౌంట్లకు భారీగా డబ్బులు చేరవేశారని కేం ద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి శనివారం టిఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది. తక్షణమే దీనిపై సమగ్ర విచారణ జరిపించి తీసుకోవాలని కోరింది. కేంద్ర ప్ర భుత్వం అండ చూసుకుని బిజెపి నాయకులు ఎన్నికల నిబంధనలకు పూర్తిగా తూట్లు పొడుస్తున్నారని ఆ ఫిర్యాదులో టిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భారత్ కుమార్ పేర్కొన్నారు. రా జగోపాల్‌రెడ్డ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా సంస్థ నేరుగా ఓటర్ల ఖాతాల్లోకి డబ్బులు వేయించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ నిధులు ఓటర్లకు పంచడానికే గ్రామాలు, వా ర్డుల వారీగా ఏజెంట్లకు లక్షల రూపాయలు వచ్చాయన్నారు.

కేవలం మూడు రోజుల వ్యవధిలోనే రూ. 5.22 కోట్ల నిధులు బ్యాంకుల ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకి జమ అయ్యాయని ఫిర్యాదు చేశారు. కేవలం శనివారం ఒక్క రోజులోనే మూడు ఖాతాల్లోకి కోటి రూపాయలు బదలీ అయ్యాయని వెల్లడించారు. ఇలా మొత్తం 23 బ్యాంకు ఖాతాలకు నిధులు బదలీ అయ్యాయని తెలిపారు. ఈ ఖాతాలన్నీ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉండడం విశేషమన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించాలని ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు. అలాగే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాజగోపాల్‌రెడ్డ్డి కంపెనీ నుంచి బదలీ అయిన కంపెనీలతో సుశీ ఇన్‌ఫ్రాకు ఎలాంటి వ్యాపార సంబంధాలు కూడా లేవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వివిధ కంపెనీలకు బదలీ అయిన డబ్బును వెంటనే సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఎటువంటి జాప్యం లేకుండా ఆ ఖాతాల్లోని నిధులను తక్షణమే స్తంభింపజేయాలన్నారు.

నిధులు బదలీ అయిన బ్యాంకు ఖాతాల వివరాలు

సుశీ ఇన్‌ఫ్రా కంపెనీ నుంచి వివిధ కంపెనీలకు, వ్యక్తులకు పెద్దఎత్తున నగదు బదలీ అయింది. అందులో ప్రధానంగా కంపాస్ ఇంజనీరింగ్ సంస్థకు కోటి రూపాయల నగదు శనివారం బదలీ అయింది. ఇందులో మేకల పారిజాతానికి రూ. 28 లక్షలు, నీలా మహేశ్వరీ కంపనీకి రూ.25 లక్షలు, అక్షయ సీడ్స్ కంపనీకి రూ. 25 లక్షలు బదలీ చేశారు. మిగిలిన రూ.22 లక్షలను సదరు కంపెనీ తన వద్దను ఉంచుకుంది. ఈ మొత్తాన్ని ఎవరికి ఇవ్వాలనే అంశంపై సుశీ ఇన్‌ఫ్రా నుంచి సమాచారం వచ్చిన మీదట ఇవ్వడానికి ఆ మొత్తాన్ని పెట్టుకుంది. కాగా పది రోజల క్రితం (ఈ నెల 18వ తేదీన) సుశీ ఇన్‌ఫ్రాం నుంచి పబ్బు అరుణ ఖాతాలోకి రూ.50 లక్షలు, పబ్బు రాజు గౌడ్‌కు చెందిన రెండు ఖాతాలోకి రూ.50 లక్షల చొప్పున కోటి బదలీ అయింది. ఇక ఈ నెల 14వ తేదీన మరో రెండు రెండు కోట్ల రూపాయలను వివిధ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించిందని ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో టిఆర్‌ఎస్ స్పష్టం చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News