Saturday, November 16, 2024

పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానాలకు భారీగా నామినేషన్లు..

- Advertisement -
- Advertisement -

పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానాలకు భారీగా నామినేషన్లు
మార్చి 14న ఎన్నికలు…17న ఓట్ల లెక్కింపు

రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానాల ఎన్నికలకు ఈ సారి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి.

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానాల ఎన్నికలకు ఈ సారి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి 179 నామినేషన్లు దాఖలు కాగా, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానానికి 123 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లకు చివరి రోజైన బుధవారం హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి 76 నామినేషన్లు దాఖలు కాగా, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానానికి 48 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈసారి ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ బుధవారం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26 చివరి తేదీ. మార్చి 14వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ప్రస్తుతం పట్టభద్రుల నియోజక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎన్. రామచంద్ర రావుల పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలో రెండు పట్టభద్రుల స్థానాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడదుల చేసింది.

Huge Nominations filed for TS Graduate MLC elections

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News