ఉద్యోగాల కోసం ఏళ్ళు తరబడి చదువుతున్న వారికి భారీ శుభవార్త. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉంటే ఈ వార్త మీకోసమే అని చెప్పవచ్చు. ఎందుకంటే 10 తరగతి అర్హతతో రైల్వేలో అప్రెంటీస్ సువర్ణావకాశం వచ్చింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే అప్పలు చేసుకోవచ్చు. విశేషమేమిటంటే ఈ అప్రెంటీస్ అప్లికేషన్ కు మహిళలకు ఫ్రీ గా అప్లై చేసుకోవచ్చు. అయితే, ఈ నియామకాలు దక్షిణ మధ్య రైల్వేలో ఉన్నాయి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఖాళీల సంఖ్య: నాలుగు వేలకు పైగా
దరఖాస్తు చివరి తేదీ: 27 జనవరి 2025
వయసు: 15-24 ఏళ్లలోపు ఉండాలి
విద్య అర్హత: 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లలో ఐ.టి.ఐ. చేసి ఉండాలి
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.100గా ఉంది. ఇక ఎస్సీ/ఎస్టీ/మహిళ/పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
జీతం: నెలకు రూ.7,700-20,200
ఎంపిక ప్రక్రియ: మెరిట్ జాబితా ఆధారంగా ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది
వెబ్ సైట్: scr.indianrailways.gov.in
మరిన్ని వివరాలకు scr.indianrailways.gov.in అధికారిక వెబ్‌సైట్ విజిట్ చేయండి.