Saturday, January 11, 2025

రిలయన్స్ డిజిటల్‌లో భారీ ఆఫర్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారతీయ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం రిలయన్స్ డిజిటల్ భారీ ఆఫర్లును ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్ అప్లయన్స్ కొనుగోలు చేసే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డు హోల్డర్లుకు 7.5శాతం తక్షణ డిస్కౌంట్‌ను అందజేస్తున్నట్లు రిలయన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. రూ.1000 విలువ చేసే డిస్కౌంట్ కూపన్లు అందిస్తున్నామని ప్రతినిధులు తెలిపారు. ఇంతకుముందెన్నడూ లేని రీతిలో ఎలక్ట్రానిక్స్ పరికరాలపై రాయితీని ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీ వరకూ డిజిటల్ డిస్కౌంట్ డేస్ కొనసాగుతాయని, రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్లలో వినియోగదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కంపెనీ తెలిపింది.

సులభతరమైన ఫైనాన్స్, ఈఎంఐ సదుపాయాలు కల్పిస్తున్నామనితెలిపారు. టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, రిఫ్రిజిరేటర్లు, ఆడియో సిస్టమ్స్ తదితర ఆధునిక సాంకేతికతతో కూడిన వస్తువులను తమ స్టోర్లలో లభిస్తాయన్నారు. టిసిఎల్ 65అంగుళాల టీవీ ధర కేవలం పేర్కొన్నారు. అదేవిధంగా ఆఫర్‌తోపాటు రెండేళ్లు వారంటీ కూడా అందిస్తున్నారు. సోనీ రూ.114,990కు రెండేళ్ల వారంటీతో లభిస్తుందని వెల్లడించారు. రూ.60వేల రివార్డును కస్టమర్లను పొందవచ్చని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News