14గంటలపాటు నిరీక్షణ
లండన్: ఎలిజెబత్‌ను తుదిసారి దర్శించుకుని నివాళి అర్పించేందుకు ప్రజలు వెల్లువలా లండన్‌లో బారులు తీరుతున్నారు. మైళ్లకొద్దీ క్యూలైన్లలో నిలుచుని నిరీక్షిస్తున్నారు. చరిత్రాత్మక తాత్కాలికంగా ఉంచిన క్విన్ ఎలిజబెత్ మృతదేహాన్ని చూసేందుకు శుక్రవారం ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి నివాళి అర్పించారు. శుక్రవారం ముందుగా కింగ్ చార్లెస్‌తోపాటు కింగ్ సహోదరులు ముందుగా నివాళి అర్పించిన తరువాత ప్రజలను అనుమతించారు. అధికసంఖ్యలో ప్రజలు బారులు తీరడంతో క్వీన్ ఎలిజబెత్ తుదినివాళికి ముందుగా ఆరుగంటలు సమయం పట్టింది. అనంతరం జనసమ్మర్దం ఎక్కువ అవడంతో 14గంటల సమయం పట్టింది. దక్షిణ లండన్‌లోని పార్లమెంటు నుంచి సౌత్‌వార్క్ పార్క్ వరకు సుమారు 8కిలోమీటర్లు దూరంవరకు ప్రజలు బారులు తీరారు. శుక్రవారం ఉదయం నాలుగు గంటల నుంచే ప్రజలు క్విన్ ఎలిజబెత్ మృతదేహాన్ని చూసేందుకు తరలి వచ్చారని కరోలిన్ క్విలిటీ అనే స్థానికురాలుతెలిపారు. కాగా పార్లమెంటు హౌస్ హాల్‌లో ఉంచిన క్వీన్ ఎలిజబెత్ శవపేటికను దర్శించకుండా తమను అడ్డుకున్నారని చైనీస్ అధికారులు ఆరోపించారు. యూకెలోని చైనా రాయబారిపై గతేడాది పార్లమెంటు సంవత్సరంపాటు నిషేధం విధించింది. పశ్చిమ జియాజింగ్ ప్రాంతంలోని ఉయ్ఘర్ మైనార్టీలపై చైనా వైఖరిపై నిరసించిన ఏడుగురు బ్రిటిష్ సభ్యులపై చైనా ఆంక్షలు దీంతో యూకెలో చైనా రాయబారిపై చర్యలు తీసుకున్నారు. చైనా అధికారబృందాన్ని వెస్ట్‌మినిస్టర్ హాల్‌లోకి అనుమతించకపోవడంపై వ్యాఖ్యానించేందుకు హౌస్ కామన్స్ స్పీకర్ లిండ్సే నిరాకరించారు.