Wednesday, January 22, 2025

క్యాన్సర్ రోగులకు భారీ ఉపశమనం

- Advertisement -
- Advertisement -

రూ. 80517.62 కోట్లతో పోలిస్తే 12.5 శాతం పెరిగింది. ఇందులో క్యాన్సర్ రోగులకు భారీ ఉపశమనం ప్రభుత్వం కల్పించింది. దిగుమతి చేసుకునే క్యాన్సర్ మందులపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా తొలగిస్తున్నట్టు ప్రకటించడం చాలా వరకు క్యాన్సర్ రోగులకు ఆసరా కల్పించడమే. ముఖ్యంగా మూడు క్యాన్సర్ మందులపై ఇప్పటివరకు 10% కస్టమ్స్ డ్యూటీ ఉండగా, దానిని పూర్తిగా తొలగించారు. దీంతో ట్రాస్టూజ్‌మాబ్ డెరుక్స్‌టేకాన్, ఒసిమెర్టినిబ్, దుర్వాలుమావ్ అనే ఈ మూడు క్యాన్సర్ మందులు చౌకగా క్యాన్సర్ రోగులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ మందులపై 10% కస్టమ్స్ డ్యూటీని తొలగించిన తరువాత వాటి ధరల్లో దాదాపు 10 శాతం తగ్గుతుంది. దీని వల్ల నెలలో రూ. 4 లక్షల విలువైన వైద్యం సుమారు రూ 3.5 లక్షలకే లభిస్తుంది.

అంటే రోగులు ప్రతి నెలా దాదాపు రూ 40 వేలు నుంచి 50 వేలు వరకు ఆదా చేయగలుగుతారు. ప్రస్తుతం దేశంలో క్యాన్సర్ చికిత్సకు అర్బన్ ఏరియాలో కనీసం రూ. 68,259 వరకు వ్యయం చేయవలసి వస్తోందని నేషనల్ శాంపిల్ సర్వే చెబుతోంది. యాంటీ క్యాన్సర్ మందుల ధరలు నియంత్రణ కాక ఎక్కువ ఖర్చును రోగులు భరించవలసి వస్తోంది. రేడియో థెరపీకే ఎక్కువ ఖర్చవుతోంది. ఇన్సూరెన్స్ వెసులు బాటు సరిగ్గా లేక రోగి తను స్వంతంగా ఖర్చు పెట్టక తప్పడం లేదు. నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం ఆస్పత్రి బిల్లుల్లో 80 శాతం పైగా రోగి స్వంతంగా భరించవలసి వస్తోంది. ఆయుష్మాన్ భారత్‌లో 2018 లో ఇన్సూరెన్స్ స్కీం ప్రవేశ పెట్టినప్పటికీ అది సరిగ్గా అందుబాటు కావడం లేదు. అందువల్ల ప్రాథమిక పరీక్షలు కూడా చాలా వ్యయంతో కూడుకున్నవిగా ఉంటున్నాయి. రాష్ట్రాల వారీగా క్యాన్సర్ చికిత్స వ్యయం కూడా వేర్వేరుగా ఉంటోంది. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో సరాసరి చికిత్స వ్యయం తక్కువ కాగా, తరువాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటోంది. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ వ్యయం చాలా ఎక్కువగా ఉంటోంది.

4559 ఏళ్ల గ్రూపు వయసు వారిలో లక్ష మందిలో 153 మంది, 60 69 ఏళ్ల వయసు గ్రూపు వారిలో లక్ష మందిలో 300 మంది క్యాన్సర్ కారణంగా ఆస్పత్రిలో చేరుతున్నారని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక వెల్లడించింది. దీన్ని బట్టి రిటైర్‌మెంట్ వయసు వారిలోనే క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తోందని తెలుస్తోంది. ఫలితంగా క్యాన్సర్ చికిత్స కోసం వయోవృద్ధులు అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. 2025 నాటికి భారత్‌లో క్యాన్సర్ కేసులు 15 లక్షల మార్కు దాటిపోతుందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ వ్యాధి కేసుల సంఖ్య ఒకవైపు పెరిగిపోతుండగా మరోవైపు దీని చికిత్సకు వేలు, లక్షలు రూపాయల ఖర్చు దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే బయోసిమిలర్స్ (బయోలాజికల్ డ్రగ్స్), హెపటైటిస్ బి, సి, సోఫోన్‌బువిర్, టెనోఫోవిర్, ఎంటికెవిర్ వంటి ఔషధాలు అత్యంత అధిక ధరలతో ఉంటున్నాయి. ధరల నియంత్రణ పరిధిలోకి వీటిని ప్రభుత్వం తెచ్చినప్పటికీ, ఇంకా సామాన్యులకు ఇవి అందుబాటు కావడం లేదు. ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సర్ డ్రగ్ ట్రప్ట్‌జుమాబ్‌కు నేషనల్ ఫార్మాక్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ సీలింగ్ ధర రూ. 55,812 (440 ఎంజి) గా నిర్ణయించగా కంపెనీలు మాత్రం దాదాపు రూ. 60 వేల వరకు విక్రయిస్తున్నాయి.

మరో క్యాన్సర్‌డ్రగ్ రిటుక్సిమాబ్ (500 ఎంజి) ధర రూ. 36,947గా ఉంటోంది. ఈ విధంగా దేశం లోని రోగులు క్యాన్సర్ చికిత్సలో ఔషధాలకే అధికంగా వెచ్చించ వలసి వస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమైన మూడు క్యాన్సర్ ఔషధాలకు కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం చెప్పుకోదగిన పరిణామం. మూడు క్యాన్సర్ ఔషధాలలో ట్రాస్టూజ్‌మాబ్ డెరుక్స్‌టేకాన్ అనే ఔషధాన్ని అన్ని రకాల రొమ్ము క్యాన్సర్ల చికిత్సలో వినియోగిస్తుంటారు. క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించినప్పుడు దీనిని యాంటీ బాడీ డ్రగ్‌గా ఉపయోగిస్తారు. దీన్ని హెర్సిప్టిన్ అనే పేరుతో కూడా పిలుస్తారు. సాధారణంగా క్యాన్సర్ రోగి ఈ మందును మూడు వారాలకు ఒకసారి తీసుకోవాల్సి వస్తుంది. దీని ఒక డోస్‌కి మూడు వైల్స్ అవసరం కాబట్టి దీని ధర రూ. 4 లక్షలుగా ఉంటుంది. ఇక ఒసిమెర్టినిబ్ ఔషధం ఊపిరి తిత్తుల క్యాన్సర్ చికిత్సలో వినియోగిస్తారు. రోగి ప్రతి రోజూ దీనిని తీసుకోవాల్సి ఉంటుంది. దీని ఒక నెల డోసేజ్ రూ.1.5 లక్షలు. ఇక దుర్వాలుమావ్ ఔషధం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కే కాకుండా మూత్రాశయ క్యాన్సర్‌కు కూడా చికిత్సలో వినియోగిస్తారు. మూడు వారాలకు ఒకసారి అంటే దాదాపు 21 రోజులకు ఒకసారి తీసుకోవాలి. ఒక డోస్ మార్కెట్ ధర దాదాపు రూ. 2.5 లక్షలు ఉంటుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమైన మూడు క్యాన్సర్ ఔషధాలకు కస్టమ్స్ డ్యూటీ పూర్తిగా తొలగించడం క్యాన్సర్ రోగులకు ఊపిరి పోసినట్టయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News