2016లో ‘ఎంఎస్ ధోని’ సినిమాతో హీరోయిన్‌గా కియారా అద్వానీ గుర్తింపు దక్కించుకుంది. ఇక తెలుగులో ఆమె మహేష్ బాబుకు జోడీగా ‘భరత్ అనే నేను’ సినిమాలో నటించింది. ఈ సినిమాకు ఆమె కాస్త అటు ఇటుగా 75 లక్షల వరకు పారితోషికం తీసుకుంది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్‌లో బిజీగా ఉన్నా కూడా రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది. దర్శకుడు బోయపాటి ఈ సినిమాకు గాను కియారాకు దాదాపుగా కోటి రూపాయల పారితోషికం ఇచ్చారనేది టాక్. ఆతర్వాత రెండున్నర ఏళ్లలో బాలీవుడ్‌లో ఆమె క్రేజ్ అమాంతం పెరిగింది. ముఖ్యంగా తెలుగు ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ అయిన ‘కబీర్ సింగ్’తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను దక్కించుకుంది. నటిగానే కాకుండా అందంతో కూడా ఆకట్టుకోగల సత్తా ఉన్న ముద్దుగుమ్మ అంటూ కియారా కు మంచి పేరు వచ్చింది.
బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా పేరు దక్కించుకున్న కియారా అక్కడ సినిమాను బట్టి ఇచ్చే డేట్లను బట్టి మూడు నుండి నాలుగు కోట్ల వరకు పారితోషికంగా తీసుకుంటోంది. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలోని పాన్ ఇండియా సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా మరోసారి కియారా అద్వానీ నటించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాకు గాను శంకర్… కియారాకు దాదాపుగా రూ. 5 కోట్లను పారితోషికంగా ఇస్తున్నాడని తెలిసింది. శంకర్ సినిమా అంటే బల్క్ డేట్లు ఇవ్వాల్సి ఉంటుంది.. కాస్త రిస్క్ ఎక్కువ చేయాలి. అంతే కాకుండా షూటింగ్‌కు ఏ సమయంలో రావాలంటే ఆ సమయంలో, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు డేట్లు కేటాయించాల్సి వస్తుంది. శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తే రెండు, మూడు సినిమాలకు వర్క్ చేసినంత అనుభవం వస్తుందని అంటూ ఉంటారు. అంటే అంతగా ఆయన వద్ద వర్క్ ఉంటుందని కొందరి అభిప్రాయం. అందుకే చరణ్ మూవీలో నటించేందుకు గాను కియారాకు అయిదు కోట్లు ముడుతున్నాయని చెబుతున్నారు.