హైదరాబాద్: తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ క్లియరెన్స్ కు భారీ స్పందన వస్తోంది. పోలీసుల డిస్కౌంట్ ఆఫర్లకు వాహనాదారుల నుంచి భారీగా స్పందన లభిస్తుంది. మార్చ్ 1 నుండి 15 వరకు 1.3 కోట్ల పెండింగ్ చలాన్ లు క్లియర్ అయినట్లు పోలీసులు తెలిపారు. 15 రోజుల వ్యవధిలో చలాన్ ల రూపంలో వాహనదారులు రూ.130 కోట్లు ఫైన్ లు కట్టినట్లు చెప్పారు. సాధారణ ఛార్జ్ లతో చూస్తే 600 కోట్ల రూపాయలు ఫైన్ లు విధించారు. చలాన్ కట్టిన వారిలో 80 శాతానికి పైగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధి వాహనదారులేనని తెలిపారు. నిమిషానికి 1000 చలాన్ లను వాహనదారులు క్లియర్ చేస్కుంటున్నారని చెప్పారు. మొదటి రోజే 5.5 కోట్ల రూపాయలు ఫైన్ లు చెల్లించారు. రాష్ట్రంలో పెండింగ్ చలాన్ లు డిసెంబర్ 2021 వరకు 80లక్షలకు చేరుకున్నాయి. దీంతో పోలీసులు పెండింగ్ చలాన్ క్లియరెన్స్ కోసం పోలీసు అధికారులు ఆఫర్ ప్రకటించారు. పెండింగ్ చలాన్ లను క్లియర్ చేసుకునేందుకు వాహనాదారలకు మార్చ్ 31 వరకు పోలీసులు ఆఫర్ ఇచ్చారు.
Huge Response to Clear of Traffic Pending Challans in Hyd