గజ్వేల్: గజ్వేల్ సిఎం క్యా ంపు కార్యాలయంలో గత వారం రోజుల నుంచి ని యోజకవర్గ పరిధిలోని యువతకు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్‌లు కావాలను కునే వారు దరఖాస్తులు అందచేయాలని ఇటీవల ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి ఇచ్చిన పిలుపుతో భారీ స్పందన వచ్చింది. ఇప్ప టి వరకు 9వేల దరఖాస్తులు అందాయని ప్రతాపరెడ్డి తెలిపారు. 18=35 సంవత్సరాల మధ్య వయసున్న వారు ఇంకా ఒక రోజు వరకు దరఖాస్తులు అందచేయవచ్చని ఆయన తెలిపారు. సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావుల సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా అందిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖ ద్వారా లైసెన్సులను ఉచితంగా అందచేస్తామని బుధవారం ఆ యన చెప్పారు. బుధవారం స్లాట్ బుక్ అయిన 25 0 మందికి బుకింగ్ స్లాట్స్ పత్రాలను ఆయన అందచేశారు.మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా ,ఆత్మ కమి టీ ఛైర్మన్ ఊడెం క్రిష్ణారెడ్డి, జడ్పిటిసి పంగ మల్లేశం, కౌన్సిలర్ గుంటుకు శిరీష రాజు, ఎఎంసి వైస్ ఛైర్మన్ ఉపేందర్‌రెడ్డి, పట్టణ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు నవాజ్‌మీరా, నాయకులు తోట శ్రీనివాస్,ఆర్కె శ్రీనివాస్, అహ్మద్ ,స్వామి చారి తదితరులున్నారు.
గజ్వేల్‌లో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్‌లకు భారీ స్పందన
- Advertisement -
- Advertisement -
- Advertisement -