Sunday, January 19, 2025

మద్యం దుకాణాలకు భారీ స్పందన

- Advertisement -
- Advertisement -
మూడు రోజులు…2 వేల పైచిలుకు దరఖాస్తులు
రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో భారీ పోటీ

హైదరాబాద్:  రాష్ట్రంలో మద్యం దుకాణాల కోసం భారీ స్పందన లభిస్తోంది. వైన్ షాపుల కోసం భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. మూడు రోజుల్లో అన్ని జిల్లాల నుంచి రెండువేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ప్రధానంగా రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నిజామాబాద్ జిల్లాల్లో వైన్‌షాపులను ఏర్పాటు చేయడానికి ప్రజల నుంచి అధిక స్పందన వస్తోంది. రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం దుకాణాలకు మంగళవారం (ఆగస్టు 8) నాటికి సుమారుగా 2380కు పైగా దరఖాస్తులు వచ్చినట్లుగా సమాచారం. ఒక్కో దరఖాస్తుకు నాన్ రిఫండబుల్ ఫీజు కింద 2 లక్షలు చెల్లిస్తున్నారు. 2023-, 25 నాటికి తెలంగాణలో మద్యం దుకాణాలకు కొత్త లైసెన్సులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న వైన్ షాపుల లైసెన్సుల గడువు నవంబర్ 30తో ముగియనుండగా డిసెంబర్ 01వ తేదీ నుంచి కొత్త షాపులను నడిపించుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా కొత్త లైసెన్సుల కోసం ఈ నెల 4 నుంచి ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది.
5 జిల్లాలో అధిక పోటీ
ఈ నేపథ్యంలోనే జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసిన అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రాష్ట్రంలోని 34 ఎక్సైజ్ జిల్లాల్లో రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నట్టుగా ఆబ్కారీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల 5వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో మిగిలిన 3 రోజుల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఒక్క రంగారెడ్డి జిల్లా నుంచే ఇప్పటివరకు 435 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 18 చివరి తేదీ కాగా ఇప్పటికీ దరఖాస్తులు భారీగా రావడంతో ఆదాయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వచ్చే దరఖాస్తుల ఆధారంగా లాటరీ విధానంలో ఆగస్టు 21వ తేదీన మద్యం షాపులను కొత్త వారికి కేటాయిస్తారు. గతంలో 2021, 23 సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల రూపంలో రూ.1,350 కోట్ల ఆదాయం సమకూరగా ఈసారి అంతకంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News