Thursday, December 19, 2024

గేర్డ్ ఎలక్ట్రిక్ మోటర్‌బైక్ మాటర్ ఎరాకు అపూర్వ స్పందన

- Advertisement -
- Advertisement -

మొట్టమొదటి ఎలక్ట్రిక్ గేర్డ్ మోటర్‌బైక్, MATTER AERA, మార్కెట్లోకి విడుదల అయిన ఒక నెలలోపే దేశవ్యాప్తంగా 40,000మంది ఉత్సాహభరితమైన రైడర్‌ల హృదయాలను కైవసం చేసుకుంది! భారతదేశాన్ని తుఫానులా చుట్టుముట్టిన MATTER AERA , నిజంగా ఎలక్ట్రిక్ మోటర్‌బైక్‌ల యుగం ఎట్టకేలకు వచ్చిందని రుజువు చేసింది! ప్రీ-బుకింగ్‌లు కంపెనీ వెబ్‌సైట్‌లో (matter.in) , ఫ్లిప్‌కార్ట్ మరియు OTO క్యాపిటల్‌తో సహా భాగస్వామి పర్యావరణ వ్యవస్థ ద్వారా అందుబాటులో ఉన్నాయి.

MATTER AERA కేవలం సాధారణ మోటర్‌బైక్ మాత్రమే కాదు, ఇది రైడింగ్ యొక్క భవిష్యత్తు పరంగా గణనీయమైన మార్పును సూచిస్తుంది – థ్రిల్లింగ్ మరియు ఉద్గార రహిత అనుభవాలను అందిస్తుంది. MATTER AERAని ముందుగా బుక్ చేసుకున్న ఔత్సాహికులు MATTER AERA వాగ్దానం చేసిన మోటర్‌బైకింగ్‌లో విప్లవాన్ని అనుభవించే మొదటి వ్యక్తులు అవుతారు. ప్రతి ప్రీ-బుకింగ్‌తో, భారతదేశంలో మరియు త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అసలైన పర్యావరణ అనుకూల మోటర్‌బైకింగ్‌ను వేగవంతం చేయాలనే అచంచలమైన నిబద్ధతను MATTER చూపుతుంది.

MATTER వ్యవస్థాపకులు మరియు గ్రూప్ సీఈఓ అయిన మోహల్ లాల్‌భాయ్ మాట్లాడుతూ ” మేము రైడింగ్ యొక్క భవిష్యత్తును పునర్నిర్వచించటానికి సిద్ధంగా ఉన్నందున వినియోగదారులు ఈ మార్పును స్వీకరించడానికి ఎంత ఆసక్తిగా ఉన్నారో చూడటం చాలా సంతోషాన్నిస్తుంది. ప్రీ-బుకింగ్‌కు వచ్చిన అపూర్వ స్పందన భవిష్యత్ సాంకేతికత పట్ల వారి ఆసక్తి కి నిదర్శనం. ఫ్లిప్‌కార్ట్ మరియు OTO క్యాపిటల్‌తో మా భాగస్వామ్యం సాంకేతికంగా అభివృద్ధి చెందిన మరియు పర్యావరణ అనుకూల మొబిలిటీ ని స్వీకరించడానికి ఆసక్తిగా ఉన్న వినియోగదారులను సమర్థవంతంగా చేరుకుంది. ఇది MATTERలో పరివర్తనాత్మక ప్రయాణం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది మరియు రైడింగ్ యొక్క భవిష్యత్తును పునర్నిర్వచించడంలో మాతో చేరుతున్న మోటర్‌బైక్ ఔత్సాహికులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము…” అని అన్నారు.

మొబిలిటీ యొక్క భవిష్యత్తును పునర్నిర్వచించేటప్పుడు, గ్రహం మరింత స్థిరంగా ఉండటానికి సహాయపడే కార్యకలాపాలలో కూడా MATTER నిమగ్నమై ఉంది. Earthday.org సహకారంతో, పలు నగరాల వ్యాప్తంగా నిర్వహించబోయే “కానోపీ ప్రాజెక్ట్” ద్వారా భూగోళం మీద పర్యావరణ సమతుల్యత మెరుగుపరచడం లో భాగంగా ప్లాంటేషన్ డ్రైవ్‌లలో పాల్గొనే అవకాశాన్ని తన కస్టమర్‌లకు అందించాలని MATTER లక్ష్యంగా పెట్టుకుంది.

రాబోయే నెలల్లో ఎక్స్పీరియన్స్ రైడ్‌లు మరియు డెలివరీల కోసం MATTER ఇప్పుడు సిద్ధమవుతోంది. AERAని ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్లు ఈ విప్లవాత్మక మోటర్‌బైక్ యొక్క విప్లవాత్మక లక్షణాలను అనుభవించే వారిలో మొదటివారు అవుతారు. తమ ఉత్పత్తులను నిరంతరం ఆవిష్కరించడం మరియు నిర్మించడం MATTER లక్ష్యంగా పెట్టుకుంది, తద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలో ముందంజలో ఉండేలా చూసుకుంటుంది. త్వరలోనే MATTER పలు ప్రాంతాలలో ఎక్స్పీరియన్స్ కేంద్రాలను ప్రారంభించి, ఆసక్తికరమైన రిటైల్ అనుభవాలను అందించనుంది.

హరిత భవిష్యత్తు ను హృదయపూర్వకంగా స్వీకరించినందుకు భారతదేశంలోని మహోన్నత వ్యక్తులకు MATTER బృందం హృదయపూర్వకంగా “ధన్యవాదాలు!” తెలుపుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News