Monday, December 23, 2024

పెండింగ్ చలాన్లపై రాయితీ.. ఇప్పటివరకు ఎంత ఆదాయం వచ్చిందంటే..?

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో వాహనాల పెండింగ్ చలాన్ల చెల్లింపులకు విశేష స్పందన వస్తోంది. 11 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.66 కోట్ల ఆదాయం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించిన విషయం తెలిసిందే. 2023, డిసెంబర్ 26వ తేదీ నుంచి 2024, జనవరి 10వ తేదీ వరకు వాహనాదారులు తమ పెండింగ్ చలాన్లపై రాయితితో చెల్లింపుకు అవకాశం కల్పించింది. దీంతో వాహనాదారులు వచ్చిన అవకశాన్ని ఉపయోగించుకుంటూ తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకుంటున్నారు.

ఇప్పటివరకు 76.79లక్షల చలాన్లు చెల్లించగా.. ప్రభుత్వానికి రూ.66.77కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.17కోట్ల చెల్లింపులు జరగగా.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.13.99కోట్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో రూ.7.17 కోట్లు చెల్లింపుల జరిగాయి. చెల్లింపులకు ఇంకా ఐదు రోజు సమయం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News