Thursday, January 23, 2025

టిఎస్ ఆర్టీసి బాలాజీ దర్శన్ టికెట్లకు అనూహ్య స్పందన..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బస్ టికెట్‌తో పాటు శ్రీవారి దర్శన టికెట్ పొందే సదుపాయం గతేడాది జూలై నుంచి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి) అమల్లోకి తీసుకొచ్చిన బాలాజీ దర్శన్ టికెట్లకు భక్తుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఏడు నెలల్లో 77,200 మంది భక్తులు ఈ టికెట్లను బుక్ చేసుకొని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గతేడాది జూలైలో 3,109 మంది, ఆగస్టులో 12,092 మంది, సెప్టెంబర్‌లో 11,586 మంది, అక్టోబర్‌లో 14,737 మంది, నవంబర్‌లో 14,602 మంది, డిసెంబర్‌లో 6,890 మంది, ఈ ఏడాది జనవరిలో 14,182 మంది బస్ టికెట్‌తో పాటు శ్రీవారి శీఘ్ర దర్శన టికెట్లను బుక్ చేసుకున్నారు.

తిరుమల వెళ్లేందుకు బస్ టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే శ్రీవారి శీఘ్ర దర్శన టికెట్‌ను బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రయాణికులకు ఆర్టీసి కల్పించింది. అందుకోసం టిటిడితో టిఎస్‌ఆర్టీసి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే బాలాజీ దర్శన్ టికెట్లకు భక్తుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. బాలాలయ మహా సంప్రోక్షణను టిటిడి వాయిదా వేయడంతో ఈ నెల 23 నుంచి మార్చి 1వ తేదీ వరకు బ్లాక్ చేసి ఉన్న శీఘ్ర దర్శన టికెట్లను తిరిగి విడుదల చేసింది. భక్తులు www.tsrtconline.in వెబ్‌సైట్‌లో తిరిగి టికెట్లను బుక్ చేసుకోవాలని టిఎస్ ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండి విసి సజ్జనార్, ఐపిఎస్ సూచించారు. బాలాజీ దర్శన్ టికెట్లను కనీసం వారం రోజుల ముందుగానే బుకింగ్ చేసుకోవాలని వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News