Wednesday, January 22, 2025

ఫ్యాన్సీ నంబర్లతో రవాణ శాఖుకు కాసుల పంట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్యాన్సీ నంబర్ల వేలంతో ఖైరతాబాద్ ఆర్‌టిఓకు మరోసారి కాసుల పంట పండింది. వివిధ ఫ్యాన్నీ నంబర్లకు నిర్వహించిన వేలం పాటలో రూ.45,98,490 ల ఆదాయం వచ్చింది. టిఎస్09 జిఈ 9999 నంబర్‌ను కీస్టోన్ ఇప్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ రూ.17.35 లక్షలకు దక్కించుకుంది. అదేవిధంగా టిఎస్ 09 జిఎఫ్ 0005 నంబర్‌ను రూ.3.75 లక్షలకు లలితా జ్యూవెలరీ మార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సోంతం చేసుకోగా,

టిఎస్ 09 జిఎఫ్ 0001 నంబర్‌ను రూ.3.50 లక్షలకు ఎన్‌బికె లాలెంట్ స్టూడియో సొంతం చేసుకుంది. వీటితో పాటు టిఎస్09 జిఎఫ్ 0099 నంబర్‌ను రూ.2,31,999లకు డి. వరూధీని రెడ్డి , టిఎస్09 జిఎఫ్ 0111 అనే నంబర్‌ను రూ.2,09,999లకు 99 వెంచర్స్ దక్కించున్నారు. టిఎస్ 09 జిఈ 0027 నంబర్‌ను రూ. 1,36,500లకు న్యూలాండ్ లబరేటరీస్, లిమిటెడ్, టిఎస్09 జిఎఫ్ 0007 నంబర్‌ను హిల్ థ్యీరీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News