మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రపంచ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ద ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం బృందానికి తమిళనాడు సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. మొత్తం 91 మందికి తలా లక్ష రూపాయల నగదు, ప్రతి ఒక్కరికి ప్రత్యేక ఇంటిని కేటాయిస్తూ సిఎం స్టాలిన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏనుగు రఘుని సంరక్షించి, షార్ట్ ఫిలింలో నటించిన బొమ్మస్, వల్లియమ్మాళ్‌నిసిఎం స్టాలిన్ సత్కరించారు. రెండు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకొని అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి పతాకను ప్రపంచ వేదికపై రెపరెపలాడించింది ఆర్‌ఆరార చిత్ర బృందం. తమిళనాడుకి చెందిన ద ఎలిఫెంట్స్ విస్పరర్స్ షార్ట్ ఫిల్మ్ బృందం ద ఎలిఫెంట్ విస్పరర్స్ షార్ట్ ఫిల్మ్ ద్వారా తమిళనాడు రాష్ట్రానికి , ముదుమలై జంతువుల పరరిక్షణ కేంద్రానికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడంతో పరిరక్షణ కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది సహా చిత్ర బృందంలోని 91 మందికి తలా లక్ష రూపాయల నజరానా ప్రకటించారు.
తప్పిపోయిన ఏనుగు రఘుని రక్షించి కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది ఓ కుటుంబం. నోరులేని ఏనుగును కన్నబిడ్డకన్నా అమితంగా ప్రేమిస్తారు బొమ్మస్..వల్లియమ్మాళ్‌లు. ఏనుగు రఘు సైతం వారిపై అంతకు మించిన ప్రేమను కురిపిస్తుంది. బొమ్మస్.. వల్లియమ్మాళ్‌ల మధ్య అనుబంధాన్ని పెళ్ళి వరకు వచ్చేందుకు కారణమవుతుంది ఏనుగు రఘు. మాటలు రాకున్నా భాష లేకున్నా.. జంతువులకీ, మనుషులకీ మధ్య శతాబ్దాలుగ౩ఆ పెనవేసుకున్న అనుబంధాన్ని అద్భుతంగా చిత్రీకరించారు ద ఎలిఫెంట్ విస్పరర్స్ షార్ట్ ఫిలింలో. తమిళంలో నిర్మించిన ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలం ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకొని యావత్ ప్రపంచ మన్ననలు అందుకుంది. ఇందులో భాగంగానే ది ఎలిఫెంట్ విస్పరర్స్‌లో కనిపించిన ఎలిఫెంట్ కేర్ టేకర్ బొమ్మన్ అండ్ బెల్లి దంపతులకు తమిళనాడు సిఎం స్టాలిన్ రూ.2 లక్షల బహుమతి అందజేశారు. ఎలిఫెంట్ కేర్ క్యాపులో వర్క్ చేసిన 91 మందికి సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి లక్ష ఇస్తున్నట్లు ప్రకటించారు.