Wednesday, January 22, 2025

పెళ్లికి వెళ్తున్న వ్యాన్‌కు ట్రక్కు ఢీకొని 8మంది మృతి

- Advertisement -
- Advertisement -

మొరాదాబాద్: పెళ్లికి బయల్దేరిన వ్యానుకు ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఆ వ్యానులో ప్రయాణిస్తున్న వారిలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నారు. 15 మంది గాయపడ్డారు. ఖైర్‌కాతా గ్రామ సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది.

వ్యానులో మొత్తం 26 మంది ఉన్నట్టు ఎస్‌పి హేమరాజ్ మీనా చెప్పారు. గాయపడిన వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News