Saturday, December 21, 2024

సంక్రాంతి వేళ సొంతూరు బాట.. కిక్కిరిసిన ఆర్టీసి బస్టాండ్లు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు ప్రజలు జరుపునే ముఖ్య పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. ముఖ్యమంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు సంక్రాంతి పండగ సంబరాలను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. దీంతో హైదరాబాద్ లో నివసిస్తున్న ఇరు రాష్ట్రాల ప్రజలు తమ సొంతూళ్లకు పయనమయ్యారు. కొందరు సొంత వాహనాల్లో, మరికొంతమంది ఆర్టీసి బస్సులో తమ ఊళ్లకు చేరుకునేందుకు బయల్దేరారు. దీంతో నగరంలోని ఎంజిబిఎస్, జేబిఎస్, దిల్ సుఖ్ నగర్ ఎల్బీనగర్ లోని అన్ని ఆర్టీసి బస్టాండ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. మరోవైపు విజయవాడ దారిలో పంతంగి టోల్ ప్లాజా వద్దకు అధిక సంఖ్యలో వాహనాలు చేరుకోవడంతో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది.

Huge Sankranti Rush at Bus Stands in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News