Wednesday, January 22, 2025

రంజాన్ వేళ.. చార్మినార్ వద్ద భారీ బందోబస్తు

- Advertisement -
- Advertisement -

ఆర్‌పిఎఫ్ బలగాలు, పోలీసుల మోహరింపు
రంజాన్ సందర్భంగా బందోబస్తు ఏర్పాటు
పర్యవేక్షించిన సిపి సివి ఆనంద్, అదనపు సిపి విక్రం సింగ్ మాన్

హైదరాబాద్: రంజాన్ చివరి శుక్రవారం కావడంతో చార్మినార్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు, ఆర్‌పిఎఫ్ బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు. రంజాన్ చివరి శుక్రవారం కావడంతో ముస్లింలు మక్కా మసీద్ వద్ద ప్రార్థనలు చేసేందుకు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

చార్మినార్, మక్కామసీద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జమాతుల్ విధా సందర్భంగా మక్కామసీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ముస్లిం సోదరుల ప్రార్థనలు ప్రారంభం అయ్యాయి. దీని కోసం ముస్లిం పెద్దలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను వివిధ పాయింట్ల వద్ద మళ్లించారు. నయాపూల్ వైపు నుంచి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను మదీనా జంక్షన్ వద్ద ఆపి సిటీ కాలేజీ వైపునకు మళ్లించారు.

మక్కా మసీద్‌కు ప్రార్థనల కోసం వచ్చే వారి వాహనాలను నిలిపేందుకు ఏడు వేర్వేరు చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేశామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కాగా చార్మినార్ ప్రాంతంలో బందోబస్తును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, అదనపు పోలీస్ కమిషనర్ విక్రం సింగ్ మాన్, సౌత్‌జోన్ డిసిపి సాయిచైతన్య పర్యవేక్షించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News