Monday, December 23, 2024

టర్కీ పోర్ట్‌లో మునిగిపోయిన భారీ ఓడ

- Advertisement -
- Advertisement -

ship sink in turkey port

అంకారా: ఈజిప్టు కార్గో నౌక టర్కీలో బోల్తా పడింది. అనేక కంటైనర్లను సముద్రంలో పడిపోయాయి. ‘సీ ఈగిల్’ అనే ఓడ పక్కకు ఒరిగి మునిగిపోతున్న వీడియో  సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ ఓడ టర్కీలోని ఇస్కెండరమ్ పోర్ట్‌లో డాక్ అయింది. సంఘటన జరిగినప్పుడు బాక్సులను అన్‌లోడ్ చేసే ప్రక్రియ కొనసాగిందని షిప్పింగ్ వార్తలపై నివేదించే వెబ్‌సైట్ ‘ట్రేడ్‌విండ్స్’ పేర్కొంది.  ఈ ఘటన శనివారం జరిగిందని, ఈ నౌకను 1984లో నిర్మించారని  తెలిపింది.

ఓడ వేగంగా నీటిలో మునిగిపోయింది, సిబ్బంది, సరుకును లోడ్ చేస్తున్న వ్యక్తులు షాక్ కు  గురయ్యారు. టర్కీ రవాణా, మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ ‘టోగోఫ్లాగ్ చేసిన ఓడ నుండి 24 కంటైనర్లు జారిపోయాయని, చిన్న చమురు లీక్ కూడా కనుగొన్నట్లు’’ ట్విట్టర్‌లో తెలిపింది. అదృష్టవశాత్తూ, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు, వారికి ఎటువంటి గాయాలు సంభవించలేదు. ప్రభుత్వం తర్వాత ఒక ప్రకటన విడుదల చేసింది.  ఆ  నౌక స్థిరత్వ సమస్యలను ఎదుర్కొంటోందని,  దానిని సమతుల్యం చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆ నౌక మరొక కెప్టెన్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై  టర్కీలోని ఓడరేవు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఓడలోని ఇంధనాన్ని ఆఫ్‌లోడ్ చేసి కంటైనర్‌ను వెలికితీసే ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఓడ సెప్టెంబర్ 17న టర్కీలోని మెర్సిన్ నుండి ఇస్కెండెరమ్‌కు చేరుకుంది. సిబ్బంది ప్రకారం, అప్పటి వరకు అన్ని ఆన్‌బోర్డ్ సిస్టమ్‌లు మామూలుగానే పనిచేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News