Tuesday, November 5, 2024

ప్రభుత్వ పాఠశాలలు ఫుల్.. ప్రైవేట్ స్కూల్స్‌లో వెలవెల

- Advertisement -
- Advertisement -

Huge Students joined in Government schools

కరోనా దెబ్బతో సర్కార్ బడులకు పూర్వ వైభవం
కోసం ప్రైవేట్ స్కూళ్లకు పరుగులు
కోసం ప్రభుత్వ బడుల ముందు క్యూ

మన తెలంగాణ/హైదరాబాద్ : సర్కార్ బడులకు పూర్వ వైభవం సంతరించుకున్నాయి. నాడు విద్యార్థులు లేక వెలవెల బోయిన ప్రభుత్వ పాఠశాలలు నేడు విద్యార్ధులతో కళకళలాడనున్నాయి. గతంలో ఇంగ్లీష్ మీడియం పేరుతో ప్రైవేట్ బడుల బాట పట్టిన తల్తిదండ్రులు కరోనా దెబ్బకు తిరిగి ప్రభుత్వ పాఠశాలలకు పరుగులు పెడుతున్నారు. దీంతో నాడు నిరాధారణకు గురైన పాఠశాలలే నేడు విద్యార్థులు ఎంత మంది వచ్చినా అక్కున చేర్చుకుని విద్యా బుద్దులు బోధించేందుకు సిద్దం అవుతున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు పున ః ప్రారంభం కానుండడంతో తమ పిల్లల అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు క్యూ కట్టారు. దీంతో వచ్చిన ప్రతి విద్యార్థులకు చేర్చుకునేందుకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ బృందాలు ముందుకు వస్తున్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థల్లో చాల మేరకు విద్యా పేరుతో వ్యాపారం చేయడమే తప్ప ఇటు విద్యార్థుల భవిష్యత్తుతో పాటు తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితిలను ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా బడులన్ని మూత పడడంతో పలు ప్రైవేట్ పాఠశాలలు ఆన్‌లైన్ పాఠాల పేరుతో అందిన కాడికి దండుకుంటుండగా విద్యార్థులకు మాత్రం కొత్తగా అక్షరం ముక్క రాకపోగా తల్లిదండ్రుల జేబులకు మాత్రం చిల్లులు పడుతున్నాయంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది.

మరో వైపు ప్రభుత్వ పాఠశాలల్లో చాల మేరకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉండడమే కాకుండా ఉచితంగా పుస్తకాలను అందజేయడంతోపాటు కరోనా సమయంలో ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు సైతం విశేష అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో తమ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో క్లాస్‌లను నిర్వహిస్తోంది. దీంతో ఇప్పుడిప్పుడే మేల్కొంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు పరుగులు పెడుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ః

ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయలు ఉండగా, కరోనా నేపథ్యంలో సైతం ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల నుంచి ఫీజుల నుంచి చాల మేరకు వసూళ్లు చేసినప్పటికీ జీతాలు ఇవ్వలేమంటూ చాల మేరకు ఉపాధ్యాయులను విధుల నుంచి తప్పించారు. దీంతో సెప్టెంబర్ ఒక్కటి నుంచి పాఠశాలలు పున ః ప్రారంభమైన తమ పిల్లలకు పెద్దగా చదువులు చెప్పే పరిస్థితులు కూడా లేకపోవడం, మరో వైపు థర్డ్ వే నుంచి తప్పించుకోవాలంటే మరో రెండు నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాఠశాలలు ప్రారంభమైనా అవి ఎన్నిరోజులు తెరిచి ఉంచుతారనే గ్యారటీ లేకపోవడం, మరోవైపు గతంలో ఫీజులు వసూళ్లు చేసుకునేందుకే పాఠశాలలు ప్రారంభించి తిరిగి 15 రోజుల లోపే మూసివేసిన విషయాన్ని తల్లిదండ్రులు గుర్తు చేసుకుంటున్నారు.

ఫీజులు వసూళ్లు చేసుకున్న తర్వాత తిరిగి పాఠశాలలు మూసివేస్తే ఈ ఏడాది కూడా పిల్లల చదువుతో పాటు ఆర్థికంగా కూడా నష్ట పోతమనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజు దోపిడి నుంచి తప్పించుకునేందుకు పలువురు తల్లిదండ్రులు ముందు జాగ్రత్తతో ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చిన తర్వాత కరోనా కారణంగా ఒక వేళా పాఠశాలలు మూత పడినా ఇక్కడా కూడా అన్‌లైన్‌లో తరగతులను నిర్వహిస్తుండడం అది పూర్తిగా ఉచితమే కావడంతో తమ పిల్లల చదువులను కొనసాగించినట్లు కావడమే కాకుండా ఆర్ధికంగా కూడా కుటుంబానికి కలిసి రానుందని ఈ నిర్ణయం తీసుకుంటుమన్నఅభిప్రాయం తల్లిదండ్రుల నుంచి వ్యక్తం అవుతోంది.

ప్రభుత్వ పాఠశాలల్లో రెట్టింపు సంఖ్యలో విద్యార్థులు ః

నగరంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో రెట్టింపు సంఖ్యలో విద్యార్థులు చేరుతున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా మరికోన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య వేలల్లోకి చేరింది. గతంలో పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య వందలలోపు ఉండగా, ప్రస్తుతం వేలల్లో చేరుతోంది. దీంతో ఇప్పటీకే ఎ,బి,సి సెక్షన్లుగా తరగతులను నిర్వహిస్తున్న వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో మరిన్ని సెక్షన్లను పెంచేందుకు సిద్దంఅవుతున్నారు. అంతేకాకుండా కోఎగ్జికేషన్ ఉన్న పాఠశాలలో విద్యార్థులు, విద్యార్థినులకు వేర్వేరుగా తరగతులు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. దీంతో అధికసంఖ్యలో విద్యార్థులున్న తరగతులకు సంబంధించి విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరుగా రోజు విడిచి రోజు పాఠ్యాంశాలను బోధించేందుకు కసరత్తు చేస్తున్నారు. తద్వారా సాధ్యమైనంత పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను కల్పించేందుకు సౌలభ్యంగా ఉంటుందనే ఈ ఆలోచన చేస్తున్నట్లు వివిధ పాఠశాలల ఉపాధ్యాయ బృందాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా కరోనా కారణంగా సామాజిక దూరాన్ని కూడా పాటించేందుకు అవకాశం ఉంటుందని, దీంతో విద్యార్థులకు ఆరోగ్యపరంగా రక్షణ కల్పించే వెసులుబాటు కూడా ఉంటుందని వెల్లడిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News