Sunday, November 24, 2024

భారీ ఉగ్రకుట్ర భగ్నం

- Advertisement -
- Advertisement -

దసరా ఉత్సవాలే టార్గెట్
ఓ పార్టీ నేతలతో పాటు జన
రద్దీ ప్రాంతాల్లో వరుస
దాడులకు పథక రచన
హైదరాబాద్‌లో ముగ్గురు
అరెస్టు పరారీలో
మరో ముగ్గురు నగదు,
గ్రెనేడ్లు స్వాధీనం

మన తెలంగాణ/హై-దరాబాద్ : హైదరాబాద్‌లో భారీ ఉగ్ర కుట్రను హైదరాబాద్ పోలీసులు ఆదివారం భగ్నం చేశారు. దసరా ఉత్సవాలనే ఉగ్ర మూకలు టార్గెట్ చేశాయి. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నే తలతో పాటు జనరద్దీ ప్రాంతాల్లో వరుస దాడులకు తెగపడేందుకు పథకం రచించాయి. ప్రధానంగా జనరద్దీ ప్రాంతాల్లో గ్రెనైడ్లతో దాడులు చేసి విధ్వంసానికి పాల్పడటమే వ్యూహంగా ఎంచుకున్నాయి. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కేసులో అనుమానిత ఉగ్రవాది అబ్దుల్ జాహెద్‌తో పాటు మొ హమ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫరూక్‌లను మలక్‌పేటలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న అబ్దుల్ జాహెద్ నుంచి రెండు హ్యాండ్ గ్రెనెడ్లు, రూ. 3,91,800 నగదు, రెండు సెల్‌ఫోన్‌లు, సమీయుద్దీన్ నుంచి హ్యాండ్ గ్రెనైడ్‌తో రూ.1,50,000 నగదు, మాజ్ హసన్ నుంచి గ్రెనైడ్, రెండు మొ బైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు.

వారి బ్యాంకు ఖాతా వివరాలు, కాల్ డేటా, సామాజిక మాధ్యమాలు పరిశీలిస్తున్నారు. మరో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు ఫర్హతుల్లా ఘోరీ, సిద్ధిక్ బిన్ ఉస్మాన్, అబ్దుల్ మజీద్‌లు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్నది ముగ్గురు హైదరాబాద్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాదులే. ఇక్కడ అనేక ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడి ఉగ్రవాద కేసులలో ఇరుక్కోవడంతో పరారై పాకిస్తాన్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఐఎస్‌ఐఎస్ (ఐసిస్) ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. గతంలో ఆ ముగ్గురు హైదరాబాద్‌కు చెందిన స్థానిక యువకులను రిక్రూట్ చేసుకుని వారిని ఉగ్రవాద రొంపిలోకి దించి అనేకానేక దాడులకు పాల్పడ్డారు. 2002లో దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయంలో సమీపంలో పేలుడు, ముంబై ఘట్కోపర్‌లో బస్సు పేలుడు, 2005లో బేగంపేట టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై ఆత్మాహుతి దాడి వంటి ఉగ్రదాడులను అమలు చేశారు. అదే విధంగా 2004లో సికింద్రాబాద్‌లోని గణేష్ టెంపుల్ సమీపంలో పేలుళ్లకు కూడా ప్రయత్నించారు.

ప్రస్తుతం పోలీసులకు చిక్కిన అనుమానిత ఉగ్రవాది అబ్దుల్ జాహెద్‌ను విచారించిన పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. జాహెద్‌కు ఐసిస్ ఆద్వర్యంలో పనిచేస్తున్న పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు టచ్‌లోకి వచ్చారు. హైదరాబాద్‌లో విధ్వంసానికి పాల్పడాలని ఆదేశించారు. ఇందుకు కొందరిని రిక్రూట్ చేసుకో వాల్సిందిగా సూచించడంతో పాటు ఇందుకు సంబంధించి ఆర్థిక సాయాన్ని అందజేసినట్లు పోలీసుల విచారణలో జాహెద్ పోలీసులకు తెలిపాడు. పట్టుబడ్డ మొహమ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫరూక్‌లను జాహెద్ హైదరాబాద్‌లో ఉగ్ర విద్వంసానికి పాల్పడేందుకు రిక్రూట్ చేసుకున్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడించాడు.

ఇటీవల పిఎఫ్‌ఐ ముసుగులో ఉగ్రప్రేరిత చర్యలు వెలుగు చూశాయి. తెలుగు రాష్ట్రాలలో పిఎఫ్‌ఐ కార్యకలాపాలపై ఎన్‌ఐఎ ప్రధానంగా దృష్టి సారించి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించింది. ఈ క్రమంలో ఇటీవలే హైదరాబాద్‌లో అరెస్టయిన నలుగురిని కస్టడీలోకి తీసుకుని అధికారులు విచారించారు. అంతేకాదు, కేంద్రం పిఎఫ్‌ఐపై నిషేధం విధించింది. దీంతో పిఎఫ్‌ఐ కార్యకలాపాలపై పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలో పిఎఫ్‌ఐలో క్రియాశీలక సభ్యుడిగా ఉన్న నిఘా, విశ్వసనీయ వర్గాల సమాచారంతో జాహెద్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో బేగంపేటలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన బాంబుదాడి కేసులో జావేద్‌ను నిందితుడిగా అనుమానించి విచారించారు. శనివారం అర్ధరాత్రి ముసారాంబాగ్‌తో పాటు చంపాపేట్, సైదాబాద్, బాబానగర్, సంతోష్ నగర్‌లోని మరికొందరి ఇళ్లలో కూడా టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాయంతో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను సోమవారం పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నారు. మరింత సమాచారం సేకరించేందుకు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా ఈ కేసుపై దృష్టి సారించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News