Monday, December 23, 2024

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. తెలంగాణ కంటే..ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండగ భారీ స్థాయిలో జరుపుకుంటారు. ఎక్కడున్న కుటుంబ సభ్యులు అందరూ.. ఈ పండక్కి కలుసుకుని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. పండక్కి వచ్చే జనాలతో ఏపీ గ్రామాలు కలకలలాడుతాయి.

హైదరాబాద్ లో ఏపీ ప్రజలు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. దీంతో పండక్కి సొంతూరుకు బయల్దేరి వెళ్తున్నారు. ఈ క్రమంలో నగరం నుంచి ఏపీకి వెళ్లే వాహనాలతో హైవేలపై వాహనాల రద్దీ నెలకొంది. దీంతో టోల్‌గేట్ల వద్ద పెద్ద ఎత్తున వాహనాలు బారులు తీరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంక్రాంతి పండగ సెలవులు కావడంతో ప్రజలు సొంతవూర్లకు పయనమవుతుండడంతో హైదరాబాద్ ఖాళీ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News