Monday, December 23, 2024

ఢిల్లీలో మైళ్ల కొద్దీ ట్రాఫిక్ జాంలు

- Advertisement -
- Advertisement -

ఖాజా మొయినుద్దిన్ జులూస్ ధమాకా

న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం ట్రాఫిక్ జాంలు జనాలకు నరకం చూపాయి. ఓ మతపరమైన ప్రదర్శన సాగేందుకు పోలీసులు అనుమతిని ఇవ్వడంతో దారిమళ్లింపులకు దిగడంతో కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జాంలు పలు ప్రాంతాల్లో ఏర్పడ్డాయి. ఐటిఒ వద్ద, రింగ్ రోడ్డు ప్రాంతాలు, మదుర రోడ్, మతిమా మహల్ రోడ్డు, నేతాజీ సుభాష్ మార్గ్, ఢిల్లీ గేట్, బిఎస్‌జి మార్గ్ ఇతర కీలక రాదార్లలో ట్రాఫిక్‌ను వేరే దార్లకు మళ్లించడంతో వాహనదారులు, పాదచారులు నానా ఇక్కట్లకు గురయ్యారు. సూఫీ ఖాజా మొయినుద్దిన్ జెర్సే ఏ ముబారక్ 811 వ మత ప్రదర్శన ఉండటం వల్ల ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఆదివారమే కాకుండా సోమ, మంగళవారాలలో కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. సోమవారం లోధీరోడ్, సఫ్దర్‌జంగ్ రోడ్, ఐఎన్‌ఎ మార్కెట్‌తో పాటు హౌజ్ ఖాజ్ నుంచి మొహ్రౌలిలోని కుతుబ్ మినార్ వరకూ రాకపోకలను నియంత్రిస్తారు. దీనితో ఇతర ప్రాంతాలలో మరో రెండు రోజులు ట్రాఫిక్ రద్దీ గందరగోళ పరిస్థితులు నెలకొనే పరిస్థితి ఏర్పడింది. ప్రయాణాలలో జాప్యం ఏర్పడుతున్నందున వాహనాలపై వచ్చే వారు , ఇతరత్రా దూర ప్రాంతాలకు వెళ్లే వారు సాధ్యమైనంత ముందుగా బయలుదేరాలని , సాధ్యమైనంతవరకూ ద్విచక్రవాహనాలు, వ్యక్తిగత వాహనాలను వీడి ప్రజా రవాణా వ్యవస్థకు చెందిన బస్సులు , రైళ్లల్లో వెళ్లడం మంచిదని సలహా వెలువరించారు. ఇతరత్రా కూడా వాహనదారులకు పలు సూచనలు ఆదేశాలు వెలువరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News