తెలంగాణలో 20 మంది ఐఎఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ.. ఆయా జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొద్ది రోజులకు తాత్కాలిక బదిలీలను మాత్రమే చేపట్టి గత ప్రభుత్వ హయాంలో కీలక స్థానాల్లో ఉన్నవారిపై బదిలీ వేటు వేసింది. అనంతరం లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది. ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం పరిపాలనపరమైన ప్రక్షాళనలో భాగంగా పెద్ద ఎత్తన మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం జరిగిన జిల్లా కలెక్టర్ల బదిలీలు మ్రాతమే కాకుండా త్వరలో సీనియర్ ఐఎఎస్ అధికారుల ట్రాన్స్‌ఫర్లు కూడా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలలోని ప్రక్షాళన దిశగా మరింత వేగవంతమైన అడుగులు ముందుకు వేసే అవకాశాలున్నాయి.
రెండు మూడు రోజుల్లో సీనియర్ ఐఎఎస్ అధికారుల బదిలీల ప్రక్రియను చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలోని లబ్ధిదారులకు పూర్తిగా అందేలా.. మెరుగైన పనితీరు ఉన్న ఐఎఎస్‌ల సేవలు వాడుకోవాలని సిఎం భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే సీనియర్ ఐఎఎస్ అధికారుల పనితీరుకు సంబంధించి ఒక నివేదికను సిఎం రేవంత్ రెడ్డి తెప్పించుకున్నారని సమాచారం. ఏది ఏమైనా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఎఎస్ అధికారుల బదిలీలను చేపట్టడంతో రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జారీ చేసిన ఉత్తర్వుల్లో జిల్లా కలెక్టర్లుగా బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.
అధికారి పేరు ప్రస్తుతం పనిచేస్తున జిల్లా బదిలీ అయిన జిల్లా
1. ముజామిల్ ఖాన్ పెద్దపల్లి ఖమ్మం జిల్లా
2. బదావత్ సంతోష్ మంచిర్యాల నాగర్‌కర్నూలు
3. సందీప్ కుమార్ ఝా జాయింట్ ఎండి, ట్రాన్స్‌కో రాజన్న సిరిసిల్ల
4. అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల కరీంనగర్
5. ఆశిస్ సంగ్వాన్ నిర్మల్ కామారెడ్డి
6. జితేష్ వి పాటిల్ కామారెడ్డి భద్రాద్రి కొత్తగూడెం
7. రాహుల్ శర్మ వికారాబాద్ అదనపు కలెక్టర్, జయశంకర్ భూపాలపల్లి
8. శిక్త పట్నాయక్ హన్మకొండ నారాయణపేట్
9. కోయ శ్రీహర్ష నారాయణపేట్ పెద్దపల్లి
10. పి.ప్రావిణ్య వరంగల్ హన్మకొండ
11. బుడుమజ్జి సత్యప్రసాద్ ఖమ్మం అదనపు కలెక్టర్ జగిత్యాల
12. బి.విజియేంద్ర రవాణా, ఆర్ అండ్ బి, ప్రత్యేక కార్యదర్శి మహబూబ్‌నగర్
13. కుమార్ దీపక్ నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్ మంచిర్యాల
14. ప్రతీక్ జైన్ పిఓ, ఐటిడిఎ, భద్రాచలం వికారాబాద్
15. నారాయణ రెడ్డి వికారాబాద్ నల్గొండ
16. ఆదర్శ్ సురభి ఖమ్మం మున్సిపల్ కమిషనర్ వనపర్తి
17. తేజస్ నందలాల్ పవార్ వనపర్తి సూర్యాపేట్
18. ఎం.సత్య శారదా దేవి వ్యవసాయశాఖ జాయింట్ కార్యదర్శి వరంగల్
19. టి.ఎస్. దివాకర జగిత్యాల అదనపు కలెక్టర్ ములుగు
20. అభిలాష్ అభినవ్ జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్ నిర్మల్