Wednesday, January 22, 2025

భారీగా బదిలీలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో నలుగురు ఐఎఎస్‌లు,12మంది ఐపిఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఏటూరునాగారం ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్‌గా చిత్రా మిశ్రా నియమితుల య్యారు. నిజామాబాద్ అడిషినల్ కలెక్టర్‌గా అంకిత్, ఉట్నూరు ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్‌గా ఖుష్బూ గుప్తాలు నియమితులయ్యారు. జిఎడిలో రిపోర్టు చేయాలని చాహత్ బాజ్‌పేయిని ఆదేశించారు. కాగా మల్టీజోన్-2 ఐజీగా రాచకొండ సిపి సుధీర్‌బాబు బదిలీ అయ్యారు. ఆయన ఇటీవల రాచకొండ సిపిగా వెళ్లిన విషయం విదితమే.

అలాగే ఆయనకు మల్టీజోన్-1 పూర్తిస్థాయి అదనపు ఐజీగానూ బాధ్యతలు ఇచ్చారు. రాచకొండ సిపిగా తరుణ్‌జోషికి బాధ్యతలు అప్పగిచారు. రామగుండం సినపిగా శ్రీనివాసులు, జోగులాంబ జోన్ డిఐజిగా ఎల్‌ఎస్ చౌహాన్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా జోయల్ డేవిస్, సిఐడి డిఐజిగా నారాయణ్ నాయక్, టిఎస్‌ఆర్‌టిసి విజిలెన్స్ ఎస్‌పిగా కె అపూర్వ రావ్, సౌత్ వెస్ట్ జోన్ డిసిపిగా డి ఉదయ్ కుమార్, ఈస్ట్ జోన్ డీసీపీగా ఆర్ గిరిధర్ నియామకమయ్యారు. ఆర్‌బివిఆర్‌ఆర్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా మురళీ ధర్, టాస్క్‌ఫోర్స్ డిసిపి గా సాధన రశ్మి పెరుమాల్‌ను బదిలీ చేశారు. నవీన్‌కుమార్‌ను డిజిపి కార్యాలయంలో రిపోర్టు చేయాలని సిఎస్ ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News