Thursday, January 9, 2025

కమర్షియల్ ట్యాక్స్‌లో భారీగా బదిలీలు?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో భారీగా బదిలీలు జరిగినట్టుగా అధికారికవర్గాల సమాచారం. కమర్షియల్ ట్యాక్స్‌లో రూ.1400 కోట్ల జిఎస్టీ కుంభకోణం కేసుకు సంబంధించి కొందరు అధికారులు ప్రభావితం చేస్తున్నారని భావించినా ప్రభుత్వం ఈ బదిలీలను చేసిందని తె లిసింది. సోమవారం ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సిఎస్‌లు అందుబాటులో లేకపోవడం తో నేడు లేదా రేపు దీనికి సంబంధించిన ఉ త్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉందని అధికారులు
పేర్కొంటున్నారు. ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖకు తగ్గిన ఆదాయం, అధికారుల అవినీతిపై ‘మనతెలంగాణ దినపత్రిక’లో వరుస కథనాలు వెలువడడంతో ప్రభుత్వం ప్రక్షాళనకు చర్యలు చేపట్టడం విశేషం. ఈ బదిలీల్లో భాగంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అదనపు కమిషనర్‌లు పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేసినట్టుగా తెలిసింది. అయితే ఈ శాఖకు చెందిన ఇద్దరు అదనపు కమిషనర్‌లను ఏకంగా వేరే శాఖకు బదిలీ చేయడం విశేషం. దీంతోపాటు పలువురు జేసిలపై కూడా ప్రభుత్వం బదిలీ వేటు వేసినట్టుగా సమాచారం. సంగారెడ్డి డిప్యూటీ కమిషనర్‌ను నిజామాబాద్ ఇన్‌చార్జీ జాయింట్ కమిషనర్‌గా, నిజామాబాద్ జాయింట్ కమిషనర్‌ను హైదరాబాద్‌లోని పంజాగుట్ట డివిజన్‌కు, పంజాగుట్ట డివిజన్‌లో పనిచేసే జేసిని వాణిజ్య శాఖ కమిషనర్ కార్యాలయానికి, మరో జాయింట్ కమిషనర్‌కు బేగంపేట డివిజన్‌కు

, బేగంపేట డివిజన్ జాయింట్ కమిషనర్‌ను వరంగల్ డివిజన్‌కు, లీగల్ విభాగం అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారిని పంచాయతీ రాజ్ శాఖకు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న మరో ఉన్నతాధికారిని పంచాయతీ రూరల్ డెవలప్‌మెంట్‌కు బదిలీ చేసినట్టుగా తెలిసింది. అయితే మరికొందరు జేసిల అవినీతి గురించి కూడా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతుండడంతో వారిపై కూడా కొరడా ఝుళిపించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతోపాటు ఈ శాఖలో పనిచేసే కొందరు జేసిలు రెండు నుంచి మూడు డివిజన్‌లకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారికి పదోన్నతులు వచ్చినా ఆ సీటును వదలమని ఆ శాఖ ఉన్నతాధికారులకు సైతం విజ్ఞప్తి చేయడం విశేషం. ఇప్పటికే ఆబిడ్స్ డివిజన్‌లో పనిచేసే ఓ జేసికి మరో డివిజన్‌ను అదనపు బాధ్యతలను అప్పగించడం ప్రస్తుతం వివాదస్పదం అవుతోంది. ఆ జేసిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా ఇప్పటివరకు ఆ జేసిపై చర్యలు తీసుకోలేదని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News