Thursday, January 23, 2025

భారీగా ఐపిఎస్‌ల బదిలీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో భారీగా ఐపిఎస్‌లు బదిలీ అయ్యారు. 28 మది ఐపిఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. జగిత్యాల ఎస్‌పిగా అశోక్ కుమార్, సూర్యాపేట ఎస్‌పిగా సన్‌ప్రీత్‌సింగ్, హైదరాబాద్ ట్రాఫిక్ డిసిపిగా రాహుల్ హెగ్డే, జోగులాంబ గద్వాల ఎస్‌పిగా టి.శ్రీనివాసరావు, ఎసిబి జాయింట్ డైరెక్టర్‌గా రుత్‌రాజ్, సిఐడి ఎస్‌పిగా విశ్వజిత్ కంపాటి నియమితులయ్యారు. ఎల్ హైదరాబాద్ ట్రాఫిక్ డిసిపిగా ఉన్న ఎల్.సుబ్బారాయుడిని డిజిపి ఆఫీసులో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. కొమురంబీమ్ ఆసిఫాబాద్ ఎస్‌పిగా డి.వి.శ్రీనివాసరావు, బాలానగర్ డిసిపిగా కె.సురేష్ కుమార్ నియమితులయ్యారు. మహబూబ్‌నగర్ ఎస్‌పిగా జానకి ధరావత్ నియమితులయ్యారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్‌పిగా హర్షవర్ధన్ నియమితులయ్యారు. శంషాబాద్ డిసిపిగా బి.రాజేష్ నియమితులయ్యారు.

వికారాబాద్ ఎస్‌పిగా కె.నారాయణరెడ్డి నియమితులయ్యారు. మేడ్చల్ జోన్ డిసిపిగా ఎన్.కోటిరెడ్డి నియమితులయ్యారు. ఆదిలాబాద్ టిజిఎస్‌పి కమాండెంట్ సెకండ్ బెటాలియన్‌గా నికితా పంత్ నియమితులయ్యారు. పిజెపిసి ఛటర్జీని డిజిపి ఆఫీసులో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. నల్గొండ ఎస్‌పిగా శరత్ చంద్ర పవార్ నియమితులయ్యారు. సికింద్రాబాద్ రైల్వేస్ ఎస్‌పిగా జి.చందనాదీప్తి నియమితులయ్యారు. వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపిగా షేక్ సలీమా నియమితులయ్యారు. నాన్ కేడర్ ఎస్‌పిగా ఉన్న ఎంఎ బారిని డిజిపి ఆఫీసులో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. తెలంగాణ సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెస్‌కు డాక్టర్ పాటిల్ సంగ్రామ్ సింగ్ గణపత్‌రావు నియమితులయ్యారు. తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో, హైదరాబాద్ ఎస్‌పిగా పి.సాయి చైతన్య నియమితులయ్యారు. హైదరాబాద్ సిటీ నార్త్‌జోన్ డిసిపిగా సాధనా రష్మీ పెరుమాల్ నియమితులయ్యారు.

నిజామాబాద్ డిచ్‌పల్లి 7వ బెటాలియన్ కమాండెంట్‌గా రోహిణి ప్రియదర్శిని నియమితులయ్యారు. బి.రాంప్రకాష్‌ను డిజిపి ఆఫీసులో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. వరంగల్, జనగామ వెస్ట్‌జోన్ డిసిపిగా బి.రాజా మహేంద్ర నాయక్ నియమితులయ్యారు. పి.సీతారామ్‌ను డిజిపి కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. రామగుండం మంచిర్యాల డిసిపిగా ఎ.భాస్కర్ నియమితులయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News