Monday, December 23, 2024

పెట్రోల్ బంకులకు క్యూ కట్టిన వాహనాలు.. హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ కోసం ఒక్కసారిగా వేలాది వాహనాలు పెట్రోల్ బంకులకు చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. కేంద్రం తీసుకొచ్చిన హిట్‌ అండ్ రన్‌ వాహన చట్టాన్ని వ్యతిరేకిస్తూ ట్రక్కు డ్రైవర్లు సమ్మె చేపట్టారు. దీంతో నిన్నటి నుంచి బంక్‌లకు పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ అని బోర్దులు దర్శనమిస్తున్నాయి. ఆయిల్ కొరతతో సిటీలో చాలా పెట్రోల్‌ బంక్‌లు మూసివేశారు. ఈ క్రమంలో పెట్రోల్‌, డీజిల్‌ కోసం సిటీలోని పలు పెట్రోల్ బంకుల ముందు వాహనాలు భారీగా క్యూ కట్టడంతో గంటలకొద్ది రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఖైరతాబాద్-లక్డీకపూల్ మార్గంలో దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో మెహదీపట్నం-లక్డీకపూల్ మార్గంలో వాహనాలు స్తంభించిపోయాయి. పంజాగుట్టు-బేగంపేట మార్గంతోపాటు, బంజారా హిల్స్, కూకట్ పల్లి వంటి పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పలు ప్రాంతాల్లో ట్యాంకర్ల డ్రైవర్లతో పోలీసులు, అధికారులు చర్చలు జరిపి ధర్నా విరమింపజేశారు. దీంతో ఆయిల్‌ కంపెనీల్లో పెట్రోల్‌, డీజిల్‌ నింపుకొని ట్యాంకర్‌ డ్రైవర్లు బయల్దేరుతున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News