Monday, December 23, 2024

యుద్ధంతో చితికిన రష్యన్ల బతుకులు

- Advertisement -
- Advertisement -

Huge war influence on the lives of the Russians

సరుకు దొరకదు…కరెన్సీ చెల్లదు
ఆగిన సరఫరాలు సాగని బ్యాంకింగ్‌లు
సామాన్యుడి ఖర్చు బారెడు

మాస్కో : యుద్ధంలో విజేతలు అంటూ ఎవరూ ఉండరనే విషయం రష్యా ఉక్రెయిన్ పరిణామాలలో స్పష్టం అయింది. ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడికి ప్రతిచర్యగా పశ్చిమ దేశాలు రష్యాపై తీవ్రస్థాయి ఆంక్షలకు దిగాయి. దీని ఫలితంగా రష్యన్ల జనజీవితంపై పెను ప్రభావం పడింది. ఉక్రెయిన్‌పై తమ దాడులను రష్యాఅధ్యక్షులు గట్టిగా సమర్ధించుకుంటున్నారు. తాము జరుపుతున్నది యుద్ధం కాదు కేవలం సైనిక చర్య అని, స్పెషల్ ఆపరేషన్ అని పుతిన్ పేర్కొంటున్నారు. ఈ వాదనను అమెరికా ఇతర దేశాలు తిప్పికొడుతున్నాయి. యుద్ధం కోసం ఇది ఎంచుకున్న సాకు తప్ప మరోటి కాదని తెలిపాయి. యుద్ధం భీకర రూపం దాలుస్తున్న దశలోనే రష్యాలో దైనందిన జీవితాలపై ప్రభావం పడుతోంది. ఇప్పటివరకూ ఉన్న జీవన వ్యయం పెరిగింది. పలు ఆర్థిక సంస్థలు బలహీనం అవుతూ ఉండటంతో వేల సంఖ్యలో ఉద్యోగాలు పోతాయనే ఆందోళన నెలకొంది. దిగుమతులపై ఇతర దేశాల ఆంక్షలతో సంబంధిత రంగాలలో ఉత్పత్తి వట్టిపోతోంది. ఇతర దేశాల నుంచి కీలక నిత్యావసర వస్తువుల సరఫరాలు ప్రస్తుత యుద్ధ దశలో నిలిచిపోతున్నాయి.

దీనితో అనేక ప్రాంతాలలో వంట నూనెలు, చక్కెర ఇతర రోజువారి సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇతర దేశాల ఆంక్షల వలయం నేపథ్యంలో వెనువెంటనే ధరల సూచి రష్యాలో 2.2 శాతం పెరిగింది. ఔషధాలు, ఇతర సరుకులు చీకటి బజారులోకి వెళ్లుతున్నాయి. దీనితో పలు షాపులలో విక్రయాలు పరిమితం అయ్యాయి. దీనితో ప్రజానీకం దిక్కుతోచనిస్థితికి గురైంది. ఫిబ్రవరి 20వ తేదీన తాను సరుకులకు ఆర్డర్లు ఇవ్వగా లెక్క చూసుకుంటే 5500 రూబెల్స్ ఖరారు అయందని, అయితే సరుకు చేతికి అందేసరికి ఇది 8వేల రూబెల్స్‌కు చేరుకుందని రష్యాల ఉంటోన్న ఓ యూరప్‌వాసి తెలిపారు. ద్రవ్య వినిమయం విషయంలోనూ పలు చిక్కులు ఏర్పడుతున్నాయి. అమెరికా ఆంక్షల నేపథ్యంలో డాలర్ల మార్పిడికి వీలు కాని స్థితి ఏర్పడింది. ఆంక్షల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిన విషయాన్ని రష్యా ఆర్థిక మంత్రిఆంటోన్ సిలూవానోవ్ తెలిపారు. దీనితో ఇప్పుడు తాము ఇప్పుడు చైనా కరెన్సీ ద్వారా డాలర్లు సేకరణకు పాల్పడాల్సి వస్తోందన్నారు.

ప్రత్యేకించి చక్కెర ధర 20 శాతం పెరిగింది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు ఎక్కువ ధరకు దొరుకుతున్నాయి. సరఫరా అందకపోవడంతో ఉన్న సరుకులకు ఎక్కువ ధరలు పల్కుతున్నాయి. పలు ప్రఖ్యాత టీవీ బ్రాండ్లు ఎక్కువ రేట్లకు పోతున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ అతలాకుతలం అయింది. రష్యా ఆర్థిక సంస్థలను స్విఫ్ట్ ఇంటర్నేషనల్ పే మెంట్ సిస్థమ్ నుంచి తొలిగించారు. దీనితో అంతర్జాతీయంగా రష్యన్లు తమ లావాదేవీలు సాగించడానికి యుద్ధం చేసినట్లు అవుతోంది. రష్యాలో యాపిల్, గూగుల్ పే , మాస్టర్ కార్డు, వీసా ఇతర సర్వీసులు పరిమితం అయ్యాయి. దీనితో ద్రవ్య చలామాణిలో తిరకాసు ఏర్పడింది. చలి ప్రాంతపు రష్యాలో ప్రజలు ఇప్పుడు వస్త్రాలు, తిండికి ఎక్కువగా ఖర్చ పెట్టాల్సి వస్తోంది.

రష్యా మీడియాకు సంకెళ్లు

ఉక్రెయిన్ వార్ పరిస్థితిని తెలియచేసే స్వతంత్ర రష్యా మీడియాపై ఇప్పుడు పలు ఆంక్షలు విధించారు. చాలా కాలంగా రష్యాలో మీడియాపై పరిమిత ఆంక్షలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఫ్రీ మీడియా ఇప్పటి పరిస్థితులలో తమ స్వేచ్ఛ మరింత దెబ్బతిందని పేర్కొంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. వాస్తవాలను వెలుగులోకి తెచ్చే పత్రికలు టీవీ ఛానల్స్‌ను రష్యా ప్రభుత్వం మూసివేయిస్తోంది. రష్యా టీవీ ఛానల్‌కు చెందిన మొత్తం సిబ్బంది సామూహికంగా రాజీనామాలు చేసినట్లు ఇటీవల సామాజిక మాధ్యమాలలో వార్తలు వచ్చాయి. దీనితో రష్యాలో ఇప్పుడు మీడియా పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News