Saturday, September 21, 2024

రాష్ట్ర సరిహద్దుల్లో ఎపి పోలీసుల హల్‌చల్

- Advertisement -
- Advertisement -

Hulchal of AP police in state borders

 

మనతెలంగాణ/హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని పుల్లూరు గ్రామం, రాష్ట్ర సరిహద్దులోని మద్యం షాపులలో ఎపికి చెందిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం రెండు రోజుల పాటు సోదాలతో పాటు హల్‌చల్ చేశారు. ఎపిలోని కర్నూలు నగర సమీపంలో ఉన్న పుల్లురు గ్రామంలో కర్నూలు పోలీసులు సోదాలు చేపట్టడం ఉద్రిక్తతలకు దారి తీసింది. తొలుత వీరిని రాష్ట్ర పోలీసులుగా గ్రామస్థులు భావించి స్థానిక పోలీసులకు సమాచారం. ఈక్రమంలో స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టంతో వచ్చిన వారు ఎపిలోని కర్నూలు పోలీసులని తేలింది. దీంతో గ్రామస్థులు కర్నూలు నుంచి వచ్చిన పోలీసుల జీపును చుట్టుముట్టారు.

ఈ నేపథ్యంలో ఎపి పోలీసులను స్థానిక పోలీసులు ప్రశ్నించడంతో కర్నూలు పోలీసులు పొంతనలేని సమాధానాలు చెప్పి తప్పించుకునే యత్నం చేశారు. సరిహద్దులో ఉన్న వైన్ షాపులకు నోటీసులు ఇవ్వడం కోసం వచ్చామని, నేరస్థుల అరెస్ట్ చేసేందుకు వచ్చామంటూ పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. కాగా రాష్ట్ర పోలీసులకు ఏలాంటి సమాచారం ఇవ్వకుండా ఎపి పోలీసులు గ్రామంలోకి ఎలా వస్తారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం సరిహద్దు ప్రాంతాల్లోని వైన్స్ షాపులకు నోటీసులు ఇచ్చారని సమాచారం. నిబంధనల ప్రకారం ఇలా చేయడానికి వీల్లేకపోయినప్పటికీ ఎపి పోలీసులు దురుసుగా వ్యహరించడంపై సరిహద్దు ప్రాంత గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మందు బాబులకు బెదిరింపులు

తెలంగాణ, ఎపి రాష్ట్రాల సరిహద్దులో ఉన్న పుల్లురు గ్రామంలో తక్కువ ధరకు మద్యం లభిస్తుండటంతో కర్నూలు నగరానికి చెందిన మద్యం ప్రియులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వీరిని నియంత్రించడంతో పాటు బెదిరింపులకు గురిచేయడం కోసం ఎపి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సరిహద్దులోని వైన్‌షాపుల తనికీలు చేపడుతున్నారు. తనికీలు చేపటే అధికారం లేనప్పటికీ వారు తనికీల పేరిట హల్‌చల్ చేస్తుండటంతో స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని వారిని వారించారు. కాగా రాష్ట్రంలో 16శాతం అధిక ధరలకు మద్యం విక్రయిస్తుండం, ఎపిలో 75శాతం ధరలు పెంచడంలో సరిహద్దులోని వైన్ షాపులకు గిరాకి పెరిగింది. దీంతో మద్యం ప్రియుల తాకిడీ అధికమైంది.

కేవలం నాలుగు కిలీమీటర్లు దాటితే తక్కువ ధరలకు మద్యం లభిస్తుండటంతో సరిహద్దు గ్రామాల్లో నివాసం ఉంటున్నవారు బోర్డర్ దాటి వచ్చి మద్యం సేవించి తిరిగి వెళ్తున్నారు. కొందరైతే వాహనాల్లో దొంగ చాటుగా మద్యం తరలిస్తున్నారు. తెలంగాణలో రకరకాల మద్యం బ్రాండులు అందుబాటులో ఉండటం, ధర తక్కువ కావడంతో మద్యం ప్రియులు సరిహద్దులు దాటడానికి వెనుకాడటం లేదు. ఈ విషయంలో ఎపి ఎక్సైజ్, పోలీసులు ఒకింత ఆగ్రహంతో ఉన్నారు. మద్యం కోసం సరిహద్దులు దాటే మందుబాబులపై కేసులు సైతం పెడుతున్నారు. మందుబాబులను బెదిరించడంతో పాటు కేసులు నమోదు చేస్తూ ఎపి పోలీసులు హల్‌చల్ చేస్తుండటం గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News