Sunday, December 22, 2024

ఉగ్ర రూపంలో హనుమంతుడు

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ లీడ్ రోల్స్ పోషిస్తున్న ఆదిపురుష్ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినిమా లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈనెల 16న విడుదల కానుంది ఈ సినిమా. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా దర్శక నిర్మాతలు ఒక కొత్త పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేయడం జరిగింది.

ఎంతో కోపంగా, చేతిలో గధ పట్టుకొని కనిపిస్తున్న హనుమంతుడి పోస్టర్‌ను విడుదల చేశారు. చూడగానే ఒళ్ళు గగుర్పొడిచే ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను టీ సిరీస్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈనెల 6వ తేదీన తిరుపతిలో ఘనంగా నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News