ముంబై: ‘హమ్ పాంచ్’ హిందీ టివి సీరియల్ 1975 దశకంలో ప్రతి ఇంటా ఆదరణ చురగొంది. ఆ సీరియల్‌లో నటించిన అశోక్ షరాఫ్ నేడు 75వ పడిలో పడ్డారు. నాడు ఆయనతో నటించిన అనేక ప్రఖ్యాత నటీమణులు నేడు ఆయన గురించి గొప్పగా చెబుతున్నారు. ఎవరేమన్నారో చూద్దాం…
“ఆయన సూపర్ స్టార్ అయినప్పటికీ నా వంటి 17 ఏళ్ల నిర్మాతతో ‘హమ్ పాంచ్’లో పనిచేయడానికి ఆయన ఒప్పుకున్నారు. పరిమిత బడ్జెట్‌తో చేసిన షోకు ఆయన అంగీకరించారు. మొదట మేము ఆయనతో ఒకే ఒక పైలట్ ఎపిసోడ్ చేశాము. దాని సిడి కూడా నా వద్ద ఇప్పటికీ ఉంది. మా ‘హమ్ పాంచ్’ షో దాదాపు 10 ఏళ్ల పాటు ప్రేక్షకులను అలరించింది. పైగా అది మా బాలాజీ తొలి టివి షో. నేను ఆయనకు ఎంతో కృతజ్ఞురాలిని. మాది పరిమిత బడ్జెట్ టివి షో అయినప్పటికీ, నేను అతి పిన్న వయస్కురాలైన(17) నిర్మాత అయినప్పటికీ నాడు ఆయన ఎంతో సహకరించి నటించారు” అని చెప్పింది ప్రముఖ టివి సీరియల్స్ నిర్మాత ఏక్తా కపూర్.
“నన్ను గుర్తుండిపోయేలా చేసినందుకు చాలా కృతజ్ఞురాలిని అశోక్ జీ. నా ‘బాపు’ ఇప్పుడు నటనా రంగంలో 50 ఏళ్లు, జీవితంలో 75 ఏళ్లు పూర్తిచేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది.నేను భారత్‌లో ఉంటే ఈ సందర్భంగా ఆయనకు విష్ చెప్పేదాన్ని. కానీ ప్రస్తుతం నేను లండన్‌లో ఉన్నాను. నా జీవితంలో ‘హమ్ పాంచ్’ మరచిపోలేనిది. థాంక్యూ అశోక్‌జీ ” అంటూ నటి విద్యా బాలన్ ఉరఫ్ రాధికా మాథుర్( ఆ సీరియల్‌లో) తెలిపింది.
“ఆయనకు 75 ఏళ్ల అనుభవం ఉన్నప్పటికీ కేవలం 25 ఏళ్లలా వ్యక్తే. ఆ షోలో నేను మీనాక్షి పాత్ర పోషించాను. అందులో ఆయన నాకు బాపు. నా జీవితంలో కూడా ఆయన నాకు తండ్రి వంటి వారే. ఆయనకు నేను ఎంతో కృతజ్ఞరాలిని. ఆయనకు 75 ఏళ్లని నేననుకోను. ఆయన 75 ఏళ్ల అనుభవం ఉన్న కేవలం 25 ఏళ్ల వ్యక్తిలానే నాకనిపిస్తారు” అని నటి వందనా పాఠక్ తెలిపారు.
“ ఆ సీరియల్ షోలో నేను బబ్లీ పాత్రను పోషించాను. అశోక్ షరాఫ్‌తో నటించడం నాకు ఒకింత టెన్షన్‌గా ఉంటుండేది. ఆయనను నేను ఎల్లప్పుడూ ఆనంద్ మాథుర్ అనే ఆ షోలో పిలుస్తుంటాను. ఆ సీరియల్‌లో నేను బాస్ కూతురు ‘బబ్లీ’ పాత్రను పోషించాను. ఆయనతో నటించేప్పుడు నేను ఎప్పుడూ టెన్షన్‌కు గురవుతుండేదాన్ని. కానీ ఆయన మాత్రం ఎప్పుడూ మేము కంఫర్టేబుల్‌గా ఉండేలా వ్యవహరించేవారు” అని తెలిపింది సుచిత్రా బండేకర్.
“నేను ఎప్పుడూ మా అమ్మతో మరాఠి సినిమాలు చూస్తూ పెరిగాను. అశోక్ షరాఫ్ ఓ పెద్ద స్టార్. అయినా ఆయన ఎప్పుడూ ఆ ఫీలింగ్ వచ్చేలా నడుచుకోలేదు. ‘హమ్ పాంచ్’ చేసేప్పుడు నేను చాలా చిన్న దాన్ని. అంతకు మునుపు నేను ఎందులోనూ నటించలేదు. ఆయన పెద్ద నటుడయినప్పటికీ ఆయన నాకు ‘తండ్రి’గా అందులో నటించారు. నేను ఆయనతో నటించే అవకాశం చేజిక్కించుకోడంతో ఎంతో సంతోషించాను. ఆయన నాకు జీవితంలో అనేకం నేర్పించారు. మా అమ్మ కూడా నాకు సహజ నటన ఎలా ఉంటుందనేది తెలిపింది” అంటూ చెప్పుకొచ్చింది ఆ సీరియల్‌లో నటించిన నటి భైరవి రాయ్‌చురా ఉరఫ్ కాజల్ (ఆ షోలో )
The first veteran I worked with! Have a super day Ashok sir! https://t.co/6sF7Gw0Nny
— Ektaa R Kapoor (@EktaaRKapoor) June 4, 2018