Thursday, January 23, 2025

షాపులో మనిషి ముఖభాగాలు.. నాసిక్‌లో తీవ్ర కలకలం

- Advertisement -
- Advertisement -

నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ దుకాణంలో మనిషి మెదడు, కండ్లు, చెవులు కనుగొన్నారు. ఇక్కడి ముంబై నాకా ప్రాంతంలో ఉన్న భవనం నేలమాళిగలో ఈ షాపు ఉంది. కొద్ది రోజులుగా ఈ దుకాణం నుంచి దుర్వాసం వెలువడుతోంది. దీనితో స్థానికులు పోలీసులకు విషయం తెలిపారు. వారు అక్కడికి చేరుకుని తనిఖీలు చేశారు. లోపలంతా స్క్రాప్ ఉంది. అయితే మూలకు పడి ఉన్న రెండు ప్లాస్టిక్ సంచులు అనుమానాస్పదంగా ఉన్నాయి. వీటిని తెరిచి చూడగా లోపల మనిషి అవశేషాలను గుర్తించారు. ఒక వ్యక్తికి చెందిన చెవులు, కళ్లు, చివరికి బ్రెయిన్ ముఖ భాగాలు మరికొన్నింటిని గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విభాగం పరీక్షలకు పంపించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

Human Body Parts found in Nashik Shop

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News