Tuesday, November 5, 2024

శాకాహారంతోనే మానవుని జీవితకాలం పెరుగుతుంది

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:మానవులు శాకాహారం భూజిస్తే జీవితకాలం పెరుగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గు ంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పిరమిడ్ స్పిరిచ్యువల్ సోసైటి మూమెంట్, పిరమిడ్ స్పిరిచ్చువల్ ట్రస్టు హై దరాబాద్‌లు సంయుక్తంగా నిర్వహించిన మెగా శాకాహార ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రస్తుత సమాజానికి సంహారం కాకుండా సంస్కరణలు కావాలన్నారు.

శాకాహారం భుజించడంతో ఉన్నతమైన వ్యక్తిత్వ వికాసం లభిస్తుందన్నారు. హింసా చోడో.. హంసా పకడో సిద్దాంతంతో బా రత దేశాన్ని అహింసాయుత దేశంగా మార్చేందుకు బ్రహ్మర్షి పత్రీ జీ నేతృత్వంలో పిరమిడ్ స్పిరిచువల్ సోసైటి చేస్తు న్న కృషి ఎనలేనిద ని కొనియాడారు. కూరగాయల్లో ఫైబర్, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, మిటమిన్స్, మినరల్స్‌లు శరిరానికి కావాల్సిన మోతాదులో లభిస్తాయన్నారు. శాకాహార భోజనంతో వ్యాధినిరోదక శక్తి పెంపొందుతుందన్నారు. మాంసహారం తినేవారి కంటే శాకాహారుల శరీర ఆకృతిలో మార్పు ఉంటుందన్నారు.

కూరగాయలు ఎక్కువగా తినడ ంతో రక్తప్రసరణ సరిగ్గా జరిగి గుండె సంబంధిత వ్యాధులు రావన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మన్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయల సంస్థల చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య, కౌన్సిలర్ గండూరి పావనికృపాకర్, జుట్టుకొండ సత్యనారాయణ, తోట శ్యామ్, శ్రీ శివసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం అధ్యక్షులు కోటగిరి రాధాకృష్ణ, బండారు రాజా, శాకాహారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News