Thursday, December 26, 2024

డాక్టర్ ఎస్‌పి భారతిని అభినందించిన మానవ హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: కూచిపూడి నాట్యగురు, కళా రత్న, లయన్ డాక్టర్ ఎస్‌పి భారతిని మానవ హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ డాక్టర్ జస్టిస్ జి. చంద్రయ్య అభినందించారు. ఇటీవల ఆమె “ కేంద్ర సంగీత నాటక అకాడమి భారత ప్రభుత్వం ” సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ డాక్టర్ జస్టిస్ జి. చంద్రయ్యను ఆమె శుక్రవారం నాడు మర్యాద పూర్వకంగా కలుసుకోగా జస్టిస్ చంద్రయ్య ఆమెను శాలువా కప్పి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News