- Advertisement -
ఢిల్లీ: ఇప్పటికే పోలీస్ స్టేషన్‌లలో మానవ హక్కుల ఉల్లంఘన జరగడం విచారకరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ రమణ తెలిపారు. విజ్ఞాన్ భవన్‌లో లీగల్ సర్వీసెస్ యాప్, విజన్ అండ్ మిషన్ స్టేట్‌మెంట్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ విడుదల చేశారు. పోస్టాఫీసుల్లో ఏర్పాటు చేసిన న్యాయ సేవ కేంద్రాల పోస్టర్‌ను విడుదల చేశారు. పోలీస్ స్టేషన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన, వేధింపులపై సిజెఐ ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో కస్టోడియల్ హింస సహా పోలీసుల వేధింపులు కొనసాగుతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో న్యాయ సహాయం విషయంలో అవరోధాలు ఏర్పడుతున్నాయని, ప్రాధాన్యత క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగుపర్చాలని కేంద్రానికి లేఖ రాశామన్నారు.
- Advertisement -