Sunday, December 22, 2024

మొక్కలతోనే మానవ మనుగడ

- Advertisement -
- Advertisement -

ధర్మపురి: సమాజ శ్రేయస్సు కోరి ముందు చూపుతో తెలంగాణ రాష్ట్రంలో 2.73 కోట్ల మొక్కలు నాటి సీఎం కేసీఆర్ చరిత్ర సృ ష్టించారని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెల్ల గ్రామంలో ఫారెస్ట్ న ర్సరీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అటవి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ హరితోత్సవం కార్యక్రమంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పు ల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ యాస్మీన్ బాష, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డితో కలిసి మొక్కులు నాటారు.

ఈ సందర్బంగా ఫారెస్ట్ సిబ్బందిని మంత్రి శాలువతో సత్కరించారు. అనంతరం నేరెల్ల గ్రామంలో దాదాపు రూ. 65 లక్షలతో సిసి రోడ్లు, మహేంద్ర సంఘం భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన, వైకుంఠ దామంతో పాటు పలు అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమంతోపాటు అనేక అభివృద్ది పనులు చేపట్టామన్నారు.

రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురిసి సుభిక్షంగా ఉండాలనే తలంపుతో దేశంలో ఎక్కడ లేని విధంగా హరిత హారం కార్యక్రమం చేపట్టి పెద్ద ఎత్తున మొక్కలు నాటారన్నారు. హరిత హారం 8వ విడత పూర్తి చేసుకుని 9వ విడతలో అడుగు పెడుతున్నామన్నారు. మొక్కలు నాటడం వాటిని పరిరక్షించడం గొప్ప విషయమని, అలాంటి ఆలోచనలు మామూలు వ్యక్తులకు రావన్నారు.

ఇది ఓట్ల కోసం చేసే కార్యక్రమం కా దని, సమాజ శ్రేయస్సు కోసం చేపట్టిన గొప్ప కార్యక్రమమని అన్నారు. ఒక్క మాటాలో చెప్పాలంటే ఇది ప్రపంచ రికార్డుగా చెప్పు కోవచ్చునని అన్నారు. చైన దేశంలో యుద్ద ప్రాతిపదికన 250 కోట్ల మొక్కలు నాటి ఇసుక తుఫాన్‌ను అడ్డుకోవడం జరిగింద న్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బత్తిని అరుణ, ఎఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేష్, ఎంపీటీసీ రెడ్డవేని సత్యం, నేరెల్ల గ్రామ సర్పంచ్ పలిగిరి వసుంధర సత్యం, ఫారెస్ట్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News