ఆరేడు దశాబ్దాల క్రితం, నా బాల్యంలో గ్రామాల్లో నివసించేవారు ‘స్థానిక స్వీయప్రతిపత్తి వైద్యుడు’ లేదా ‘క్వాక్’ వద్ద అన్నిరకాల చికిత్సలు పొందేవారు. వీరిని సాధారణంగా ఆర్‌ఎంపి (రెజిస్టర్డ్ మెడి కల్ ప్రాక్టీషనర్) లేదా ఎల్‌ఎంపి (లైసెనస్డ్ మెడికల్ ప్రాక్టీషనర్) అని పిలిచేవారు. ఈ ‘క్వాక్’లను గౌరవంతో ‘డాక్టర్ సాబ్’ అని కూడా గ్రామస్థులు సంబోధించేవారు. వీరిలో కొందరు మూడు సంవ త్సరాల డిప్లొమా కోర్సు పూర్తిచేసేవారు కూడా వున్నారు. చాలా మంది ప్రాక్టీస్ ప్రారంభించి, అను భవం గడించి మంచి నైపుణ్యాన్ని పొందేవారు కూడా.
ఆ దశ నుంచి వైద్యరంగం దినదినాభివృద్ధి చెందుతూ, ఎంబిబిఎస్ పట్టా (బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ) ఉన్న వైద్యుడు లేదా ఎండి (జనరల్ మెడిసిన్), ఎంఎస్ (జనరల్ సర్జరీ) పూర్తి చేసిన తరువాత (జనరల్) వైద్య ప్రాక్టీస్ చేయడం సాధారణమైపోయింది. ఆ కాలంలో, రోగికి చికిత్స ప్రారంభించడానికి ముందుగా వైద్యుడు స్వయంగా రోగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం అత్యంత ముఖ్యమైన భాగంగా ఉండేది. రోగి తన ఆరోగ్య సమస్యను స్వయంగా వివరించే అవకాశం ఉండేది. ఆ తరువాత వైద్యుడు రుగ్మతకు సంబం ధించిన మరికొన్ని ప్రశ్నలు అడిగి మరింత సమాచారం పొందేవారు.
భారతదేశ వైద్య వ్యవస్థ కొన్ని మానవీయ ఇబ్బందులతో కూడిన సాధారణమైనది అయినా, దాన్ని మహోన్నతమైనదిగా, అన్ని వర్గాల వారికి అంతో-ఇంతో అందుబాటులో (Avail ability), చేరువలో (Accessibility), ఆర్థిక- వ్యయపరంగా సౌలభ్యంగా (Affordability), ఆమోదయోగ్యమైనదిగా (Acceptability) ఉండేలా రూపుదిద్దుకున్న ఒక అరుదైన వ్యవస్థ అనడం మాత్రం అతిశయోక్తి కానే కాదేమో. వైద్యపరమైన ఎలాంటి క్లిష్టమైన పొరపాట్లు చోటు చేసుకున్నా, వాటిని సమర్ధవంతంగా సరిచేయడం విషయంలో, భారతదేశం ఇతర దేశాలతో పోలిస్తే చెప్పలేనన్ని రెట్లు మెరుగనాలి. అందుకే, అమెరికా నుండి మాత్రమే కాకుండా, ఇతర దేశాల నుండి కూడా వైద్య- ఆరోగ్య సమస్యల విషయంలో సలహాలకు, చికిత్సకు, తరచూ భారతదేశానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. భారతదేశం నుండి ఇతర దేశాలకు వెళ్ళేవారి సంఖ్య తగ్గుతూ వస్తున్నది. దీనర్థం, భారత దేశంలో లభ్యమవుతున్న వైద్యసౌకర్యం ఎంతో విశ్వాసాన్ని కల్పిస్తున్నదనే విషయమే. ఇటీవలి కాలంలో అమెరికాకు తరచూ ప్రయాణించే వారికి, అక్కడ శాశ్వతంగానో, తాత్కాలిక శాశ్వతంగానో నివాసముంటున్న వారికి, లభ్యమయ్యే వైద్య సదుపాయాల (మెడికేర్) విషయంలోను, ‘వైద్యపరమైన పొరపాట్ల’ విషయంలోను, అసాధారణ, భయంకరమైన అనుభవాలు, అనుమానాలు కలుగుతున్న ప్రస్తావన పదేపదే వింటున్నాం.
వృత్తి రీత్యా ‘మెడికల్ సైకాలజిస్ట్’, అమెరికా గ్రీన్‌కార్డ్ హోల్డర్ కూడా అయిన ఒక పరిచయస్తుడు, తనకు ఆ దేశంలో ఎదురైన అస్తవ్యస్త వైద్య సదుపాయాల (‘జిగ్‌జాగ్ మెడికేర్’) గురించి తన అనుభవాన్ని వివరించాడు. తరచూ ప్రయాణించే వారికీ, ‘మల్టిపుల్ ఎంట్రీ వీసా’ కలిగినవారికి, శాశ్వత నివాసితులకు, ఆమాటకొస్తే ఎవరికీ తృప్తిగాలేదని అతను పేర్కొన్నాడు. అమెరికాలో వైద్యపరమైన సమస్యలు అనేకమని అతడూ, చాలా మంది అక్కడికి వస్తూపోతున్న, అక్కడే వుంటున్న ఇతరులు కూడా పేర్కొంటున్నారు. వీటిలో ప్రధానమైనవి, ‘వైద్య పొరపాట్లు’ కాగా, అధిక ఖర్చుతో కూడిన వైద్యం, బీమా సంస్థల ఆధిపత్యం, కృత్రిమ మేధస్సుపై అవసరానికి మించి ఆధారపడటం, శస్త్రచికిత్స- వైద్యచికిత్సల అనంతర జాగ్రత్తల విషయంలో నిపుణుల నిర్లక్ష్యం, -నిరాసక్తత, అత్యవసర వైద్యసహాయం అవసరమైనప్పుడు కూడా నిపుణులైన వైద్యుల స్థానంలో నర్సులకే బాధ్యతలు అప్పచెప్పడం, ఆరంభం నుండి చివరదాకా వైద్య ప్రక్రియల్లో విపరీతమైన అనవసర జాప్యం వున్నాయి. వైద్యఖర్చులు ఏ మాత్రం అందుబాటులో లేకపోగా, చికిత్స ఆలస్యమవుతున్నది. రోగనిర్ధారణ పరీక్షలు అత్యంత క్లిష్టతరంగా వున్నాయని పలువురు ఆవేదన వ్యక్తపరిచారు, వ్యక్తపరుస్తున్నారు.
లోగడ ప్రతి చిన్న చికిత్సాపరమైన, రోగనిర్ధారణ పరీక్షల పరమైన అంశాలలో బీమా ఆధిపత్యం ఉండగా, ప్రస్తుతం ప్రవేశం నుంచి చికిత్స దశ చివరి వరకు ‘కృత్రిమ మేధస్సు’పై ఆధారపడటం విచిత్రంగా వున్నది. ‘అమెరికాలో వాక్ స్వాతంత్య్రం తప్ప, ఏదీ ఉచితం కాదు’ అనేది పలువురి అభిప్రాయం. ఇదిలా వుండగా, ‘వైద్యపరమైన పొరపాటు’ విషయానికొస్తే, అవి, పూర్తిగా వైద్యం చేయకుండా వదిలేయడమో, చేసిన చికిత్సలో తప్పులు దొర్లడమో కావచ్చు. అత్యవసర, అత్యవసరంకాని, వైద్యసదుపాయం కలిగించడంలో ఆశాజనకమైన ఫలితాలు సాధించలేకపోవడం కూడా కావచ్చు. వైద్యనైపుణ్యం లేని సిబ్బంది, తప్పుగా రోగనిర్ధారణ, కంప్యూటర్ లోపాలు, తరచూ బ్రేక్‌డౌన్‌లు, అవసరానికి సరిపడా మందులకు బదులు అనవసరమైన ప్రిస్క్రిప్షన్లు, గమనించలేని శస్త్ర చికిత్సా సమస్యలు లాంటి అంశాలు కూడా ‘వైద్యపరమైన పొరపాట్లే.’ ఈవిషయంలో వ్యక్తుల కంటే వ్యవస్థదే ఎక్కువ బాధ్యత. ‘జాన్స్ హాప్‌కిన్స్’ (విశ్వవిద్యాలయం) అధ్యయనంలో పేర్కొన్న ‘రెసిఫర్డ్’ పరిశోధన ప్రకారం, అమెరికాలో సంభవిస్తున్న మరణాలకు, మూడవ అతిపెద్ద కారణం ‘వైద్య పొరపాట్లు’ అని స్పష్టం చేయడం జరిగింది.
విచిత్రమేమిటంటే, రోగులకు కాని, వారి సంరక్షకులకు కాని, వైద్య పొరపాట్లు ఎక్కడ, ఎలా, ఎందుకు జరిగాయనే విషయాన్ని తెలియకుండా సంబంధిత వైద్యులు గోప్యంగా వుంచుతున్నారట. ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’కి చెందిన జేమ్స్ జి ఆండర్సన్, కాతలీన్ అబ్రహామ్సన్ సంయుక్తంగా రాసిన ‘యువర్ హెల్త్ కేర్ మే కిల్ యూ: మెడికల్ ఎర్రర్స్’ వ్యాసంలో కూడా అమెరికాలో వైద్యపొరపాట్ల సంఖ్య కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, ఇంగ్లాండ్ దేశాలతో పోలిస్తే గణనీయంగా ఎక్కువని అభిప్రాయపడ్డారు.
అమెరికాలో మెడికల్ వ్యవస్థ వ్యయపరంగానే కాకుండా, సరైన చికిత్స, వసతుల లభ్యత విషయంలో కూడా పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ పరిణామాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. సమగ్ర వ్యవస్థా సంస్కరణల ద్వారానే వైద్యపరమైన జాగ్రత్తల సమస్యలను అధిగమించవచ్చు.అమెరికాలో ఉన్న మెడికేర్ విధానం ద్వారా లభ్యమవుతున్న చికిత్స నిర్లక్ష్యం, గ్రీన్‌కార్డ్ హోల్డర్లకైనా, సాధారణ సందర్శకులకైనా, ఒకే రకంగా ఉంటున్నది. విశ్వసనీయమైన భారతీయ బీమా కంపెనీ వారి ఆరోగ్య బీమా పాలసీ, అమెరికాలో లభ్యమవుతున్న అనేక రకాల ఇతర విధానాలతో పోలిస్తే వేల రెట్లు మెరుగని చెప్పాలి. యావత్భారతదేశంలోని ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితుల్లో, ఆమాటకొస్తే 24గంటలూ, ‘క్వాలిఫైడ్ వైద్యుడు’ (కనీసం ఎంబిబిఎస్ డాక్టర్) ఎవరో ఒకరు అందుబాటులో తప్పనిసరిగా ఉంటాడు. అదే అమెరికాలోనైతే, అత్యవసర చికిత్స ఎంత పెద్ద స్థాయిదైనప్పటికీ, ప్రారంభంలో నర్సు ద్వారానే మొదలవుతున్నది. చికిత్స కోసం వచ్చిన వ్యక్తి మొదట ఆ నర్సుకు తన వైద్యపరమైన వ్యక్తిగత ప్రాథమిక సమాచారం అందించాలి. వాటిలో ‘ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, బీమా వివరాలు’ సేకరించే విధానం జుగుప్సాకరంగా వుంటాయి.
ఈ ప్రక్రియకు సాధారణంగా గంట-రెండు గంటల సమయం పట్టినా పట్టవచ్చు. ఆ సమాచారాన్ని కృత్రిమ మేధస్సుకు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అనుసంధానం చేసిన తరువాతనే, అది సూచించిన విధంగా రోగిని అందుబాటులోని ఒక ‘డ్యూటీ డాక్టర్’ వద్దకు పంపిస్తారు. ఆ డాక్టర్, ప్రాథమిక పరీక్షల అనంతరం, కృత్రిమ మేధస్సు తోడ్పాటుతో, అవసరాన్ని బట్టి, సంబంధిత నిపుణుడి వద్దకు రోగిని పంపిస్తారు. ఈ రోజుల్లో, చాలా మంది యువ వైద్యులు (అమెరికన్లయినా, విదేశీయులైనా) ఎనిమిది గంటల సులభమైన ‘డ్యూటీ డాక్టర్’ విధులు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారట. ఇక్కడ వేతనం ఎక్కువగా వుండడమే కాకుండా, బాధ్యత కూడా కొంచెం తక్కువే. రోగిని ‘ఇన్ పేషంటుగా’ ఆసుపత్రిలో చేర్చుకున్న తరువాత, సంబంధిత వైద్య నిపుణుడు అవసరమైన (శస్త్ర లేదా వైద్య) చికిత్స చేస్తాడు. కానీ, భారతదేశంలో మాదిరిగా శస్త్రచికిత్స లేదా మెడికల్ ట్రీట్‌మెంట్ అనంతరం అదే డాక్టర్ తరచుగా పేషంట్ బాగోగులు కనుక్కోవడం లాంటిది, అమెరికాలో అరుదుగా జరుగుతుంది. దానికి వేరే ఏర్పాటు వుంటుంది.
ఆసక్తికరమైన ఒక సంఘటనను నా ‘మెడికల్ సైకాలజిస్ట్’ స్నేహితుడు నాకు వివరించాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఒక సీనియర్ గైనకాలజిస్టు తన కుమారుడి భుజంమీద గాయమైనప్పుడు, ప్రాథమిక నొప్పి నివారణకు తక్షణమే కావాల్సిన మాత్రలను కూడా ఫార్మసీలో కొనలేకపోయింది. అలా కొనడానికి తప్పనిసరైన ప్రిస్క్రిప్షన్ రాసే అధికారం ఆమెకు లేదు. ఎందుకంటే అది ఇతర వైద్యుని బాధ్యత. చివరికి, శస్త్రచికిత్స నిపుణుడైన మరో డాక్టర్ స్నేహితుడు సహాయం తీసుకుంది ఆమె. ఈ నేపథ్యంలో, సమగ్రత, వేగం, బాధ్యతా నిబద్ధత విషయంలో, ఆరోగ్య-వైద్య విద్యా సంపూర్ణ సరళీకరణ విషయాలలో భారత వైద్య వ్యవస్థ అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగ్గా ఉందని చెప్పడంలో సందేహం లేదు.
ఈ సందర్భంలో భారతదేశంలోని పూర్వ దశ వైద్యసదుపాయాలు గుర్తుకొస్తున్నాయి. ఆరేడు దశాబ్దాల క్రితం, నా బాల్యంలో గ్రామాల్లో నివసించేవారు ‘స్థానిక స్వీయప్రతిపత్తి వైద్యుడు’ లేదా ‘క్వాక్’ వద్ద అన్నిరకాల చికిత్సలు పొందేవారు. వీరిని సాధారణంగా ఆర్‌ఎంపి (రెజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్) లేదా ఎల్‌ఎంపి (లైసెనస్డ్ మెడికల్ ప్రాక్టీషనర్) అని పిలిచేవారు. ఈ ‘క్వాక్’లను గౌరవంతో ‘డాక్టర్ సాబ్’ అని కూడా గ్రామస్థులు సంబోధించేవారు. వీరిలో కొందరు మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సు పూర్తిచేసేవారు కూడా వున్నారు. చాలా మంది ప్రాక్టీస్ ప్రారంభించి, అనుభవం గడించి మంచి నైపుణ్యాన్ని పొందేవారు కూడా.
ఆ దశ నుంచి వైద్యరంగం దినదినాభివృద్ధి చెందుతూ, ఎంబిబిఎస్ పట్టా (బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ) ఉన్న వైద్యుడు లేదా ఎండి (జనరల్ మెడిసిన్), ఎంఎస్ (జనరల్ సర్జరీ) పూర్తి చేసిన తరువాత (జనరల్) వైద్య ప్రాక్టీస్ చేయడం సాధారణమైపోయింది. ఆ కాలంలో, రోగికి చికిత్స ప్రారంభించడానికి ముందుగా వైద్యుడు స్వయంగా రోగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం అత్యంత ముఖ్యమైన భాగంగా ఉండేది. రోగి తన ఆరోగ్య సమస్యను స్వయంగా వివరించే అవకాశం ఉండేది. ఆ తరువాత వైద్యుడు రుగ్మతకు సంబంధించిన మరికొన్ని ప్రశ్నలు అడిగి మరింత సమాచారం పొందేవారు.
ఈ రకమైన వైద్యుల ’క్లినికల్, శారీరక పరీక్ష’ ప్రధానంగా నాలుగు విధాలుగా ఉండేది. అవి వరుసగా: ఇన్‌స్పెక్షన్ (శరీరాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం), పాల్‌పేషన్ (వేలు లేదా చేతులతో శరీరాన్ని పరిశోధించడం), ఆస్కల్టేషన్ (స్టెతోస్కోప్ ఉపయోగించి శరీర ప్రధాన భాగాల శబ్దాలను వినడం), పర్క్యూషన్ (శరీరంలోని ద్రవం లేదా గాలి సేకరణను గుర్తించడానికి శరీరంపై విద్యాపరంగా తట్టడం ద్వారా శబ్దాన్ని గుర్తించడం)వుండేవి. వీటన్నిటిలో పర్క్యూషన్ పాత్ర ముఖ్యమైనది. రోగి శరీరంపై ఒక చేతి వేళ్లను ఉంచి, మరొక చేతి వేళ్లతో తట్టి, తద్వారా వచ్చే గంభీర శబ్దం ద్వారా రుగ్మతను ప్రాథమికంగా గుర్తించేవారు వైద్యులు. వైద్యుడు దీని ఆధారంగా చికిత్స చేసేవాడు. ఇది పూర్తిగా వైద్యుడి ప్రత్యక్ష సంరక్షణ, పర్యవేక్షణలోనే జరిగేది. చికిత్సలో భాగంగా డాక్టర్ స్వయంగా రక్తపోటు చూడడం, అవసరమైన ఇంజక్షన్ ఇవ్వడం లాంటి ప్రతి చిన్న వివరాన్ని చూసేవారు.
ఈ వ్యక్తిగత స్పర్శతో రోగులు తృప్తి చెందేవారు. రుగ్మత పోయిన భావన కలిగేది. ఈ నైజం ఇప్పుడు కాలక్రమేణా తగ్గిపోయినట్లు కనిపిస్తున్నప్పటికీ, ఆ రోజుల్లో డాక్టర్ల వ్యక్తిగత నిబద్ధత, ఆసక్తి, రోగుల పట్ల చూపించిన ఆత్మీయత నిజంగా స్ఫూర్తిదాయకమైనవి. పాశ్చాత్యీకరణ పెరుగుతున్న కొద్దీ, క్రమేపీ స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టు, మలీ ్ట-స్పెషలిస్టు, మల్టీ- సూపర్-స్పెషలిస్టు వైద్యుల ఆవిర్భావంతో, తరచుగా తలెత్తే చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకూ ప్రత్యేక నిపుణులను సంప్రదించాల్సిన ఆగత్యం ఏర్పడింది. దురదృష్టవశాత్తూ ‘క్లినికల్, శారీరక పరీక్ష’ ఇప్పుడు అరుదైన చికిత్సా ప్రక్రియగా మారిపోయింది. భారతదేశంలో, వివిధ వర్గాల ఆర్థిక సమర్థత- స్తోమతలకు (Affordability) అనుగుణంగా, త్వరితగతిన వైద్యసేవలు వివిధ రకాల మెరుగుదలల కారణంగా అందుబాటులోకి (Accessibility) తెచ్చిన పర్యవసానంగా, అలాగే మరికొన్ని ‘విలక్షణమైన మార్పుల’ ఫలితంగా, వైద్య -ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ‘ఆమోదయోగ్యమైనదిగా’ (Acceptable)’ రూపాంతరం చెందింది.
అమెరికాలో ఉన్నతమైన వైద్యం అందించబడినా, పోనీ, అందించడం జరుగుతున్నదని ప్రచారం జరిగినా -జరుగుతున్నా, యావత్ ప్రక్రియ ప్రతిస్పర్థించలేని, భరించలేని వ్యయప్రయాసలతో కూడినదిగా భావన పెరిగిపోతున్నది. ఆ దేశంలో ‘బీమా ఆధారిత వైద్యం’ అమల్లో వున్నప్పటికీ, అది అతి కొద్దిమందికే ప్రయోజనకరమని నిస్సందేహంగా చెప్పవచ్చు. రోగికి తనకు నచ్చిన పద్ధతిలో, అంగీకారమైన విధానంలో వైద్యం అందించగలగడం ప్రతి దేశానికీ అవశ్యం. ఆరోగ్య సంరక్షణలో, డాక్టర్ -రోగి సంబంధాల, సాంస్కృతిక, విశ్వసనీయత, అవగాహనలో శతాబ్దాల నుండి వస్తూవున్న వ్యక్తిగత సంరక్షణకు, శ్రద్ధకు, భారతీయ ప్రత్యేకత ఒక మహత్తర మార్గదర్శనం, నిదర్శనం. ఇది భారతదేశ వైద్య రంగానికి ప్రత్యేకమైన విశిష్టతను ప్రపంచ వ్యాప్తంగా కలిగిస్తిన్నది. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ మనదేశ ఆరోగ్య వ్యవస్థను మించిన వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేనేలేదు.
వనం జ్వాలా
నరసింహారావు