Friday, December 20, 2024

సామజవరగమన సినిమా నంచి ‘హమ్‌సఫర్’ సాంగ్

- Advertisement -
- Advertisement -

హీరో శ్రీవిష్ణు ‘సామజవరగమన’ తో హిలేరియస్ ఎంటర్ టైన్మెంట్ అందించడానికి సిద్ధంగా వున్నారు. వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్, ఇతర ప్రమోషనల్ స్టప్ స్ట్రాంగ్ బజ్ ని క్రియేట్ చేసి క్యూరియాసిటీ పెంచాయి. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన రెబా మోనికా జాన్ కథానాయికగా నటిస్తోంది.

తాజాగా ఈ చిత్రం నుంచి హమ్‌సఫర్ అనే పాటని విడుదల చేశారు మేకర్స్. గోపీ సుందర్ ఈ పాటని క్యాచి అండ్ లైవ్లీ మెలోడిగా కంపోజ్ చేశారు. శక్తి శ్రీ గోపాలన్ పాడిన ఈ పాటకు కృష్ణకాంత్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. ‘ఇతడే నా హమ్‌సఫర్’ అంటూ కథానాయిక తన మనసులోని భావాలని తెలిపే తీరుని చాలా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేశారు.

ఈ చిత్రానికి భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన సంభాషణలు రాశారు. దర్శకుడు రామ్ అబ్బరాజు స్వయంగా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల బృందం ఈ చిత్రానికి పని చేస్తున్నారు. రామ్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. జూన్ 29న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News