Wednesday, January 22, 2025

యాదాద్రి ఆలయ హుండీ ఆదాయం రూ.కోటి 89 లక్షలు

- Advertisement -
- Advertisement -

యాదాద్రిభువనగరి:యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు నిర్వహించారు. బుధవారం 21 రోజుల హు ండీ లెక్కింపులో రూ.1,89,04,607 (1 కోటి 89 లక్ష ల, 04 వేల, 607) రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఒక ప్రకటనలో తెలిపారు. ఈ హు ండీ లెక్కింపులో మిశ్రమ బంగారం 66 గ్రా ములు, మిశ్రమ వెండి 1 కేజీల 500 గ్రాములు వచ్చింది. హుండీలో విదేశీ రూపాయలు అమెరికా 2158 డాలర్లు, ఆస్ట్రేలియా 30 డాలర్లు, కెనడా 20 డాలర్లు, యూఏఈ 30 దిరామ్స్, రియల్స్ 71, కతార్ 42, యూరప్ 70, మలేషియా 2, ఇంగ్లాండ్ 25, సింగపూర్ 5, నేపాల్ 10, ఇండోనేషియా 14000, ఒమన్ 100, చైనా 1000, రష్యా 100, బహెరన్ 1/2 కానుకరూపంలో వచ్చినట్లు తెలిపారు. ఈ ఆలయ ఉండి లెక్కింపు ఆలయ ఈఓ గీత, దేవాదాయ శాఖ ఆధికారుల పర్యవేక్షణలో కొనసాగగా ఆలయ ఉద్యోగ సిబ్బంది ఈ హుండి లెక్కింపులో పాల్గొన్నారు.

నిత్యరాబడి..స్వామివారి ఆలయం నిత్యరాబడి భాగంగా బుధవారం రూ.25,43,756 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నిత్యరాబడిలో అనుభంద ఆలయమైన పాతగుట్ట దేవాలయం, వివిధ శాఖల నుండి స్వామివారి నిత్యరాబడి సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News