Monday, January 20, 2025

వంద శాతం వైకల్యం.. పెన్షన్ అందించి ఆదుకోవాలి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి : తనకు వంద శాతం వైకల్యం ఉంది.. పెన్షన్ అందించి ఆదుకోవాలని సోమవారం ప్రజావా ణిలో ఓ బాధితురాలు ఆర్డీఓ వెంకట మాధవరావుకు అర్జి పెట్టుకుంది. వివరాల్లోకి వెళ్లితే మండలంలోని తుర్కలమద్దికుంట గ్రామానికి చెందిన విలాసాగరపు శైలజకు 2016లోనే రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం దివ్యాంగురాలిగా గుర్తింపు సర్టిఫికెట్ ఇచ్చినా పెన్షన్ రావడం లేదని వాపోయింది. ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికి అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయింది.

ఈ మేరకు సోమవారం యువతి తల్లితండ్రులు, సమాజ్ వాది పార్టీ నాయకులతో కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అనంతరం సమా జ్‌వాది రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాట్లాడుత ఈ రాష్ట్రంలో వంద కొద్ది ఎకరాలు ఉన్న వారికి రైతు బంధు ఇస్తున్నా రు కానీ, ఓ పేద కుటుంబానికి పెన్షన్ ఇవ్వడంలో ఎందుకు విఫలం చెందుతున్నారని ప్రశ్నించారు. వంద శాతం వికలాంగత్వం ఉన్న శైలజకు ఇప్పటి వరకు ఎందుకు పెన్షన్ రావడం లేదని అన్నారు.

అధికారుల నిర్లక్షం కారణంగా ఇలాంటి నిరుపేదలు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, మండల స్థాయిలో అధికారుల పనితీరులో పలు విమర్శలు వస్తున్నాయని, అయినా కూడా జిల్లా స్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. పది రోజుల్లో పెన్షన్ లెటర్ ఇవ్వాలని, లేనియెడల సమాజ్‌వాది పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష చేస్తామని మారం తిరుపతి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News