Wednesday, November 6, 2024

బిఆర్‌ఎస్ హాయంలోనే వందలాది విద్యార్థుల అస్వస్థత కేసులు

- Advertisement -
- Advertisement -

వాంకిడి ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం ఆపాలి
హరీష్ రావు ఆరోపణలను ఖండించిన మంత్రి సీతక్క

మన తెలంగాణ/హైదరాబాద్‌ః బీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలోనే ఎంతో మంది విద్యార్దుల అస్వస్థతకు సంబంధించి వందలాది కేసులు వెలుగు చూశాయని, సిరిసిల్ల నుంచి సిద్దిపేట దాకా ఎంతో మంది విద్యార్దులకు అస్వస్థతకు గురయ్యారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనసూయ సీతక్క పేర్కొన్నారు. ఆనాటి కేసులు తలచుకుంటే హైకోర్టు విచారణ చేసేంత స్థాయిలో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై రాజకీయాలు చేయడం మానుకోవాలని, మెరుగైన చికిత్స అందిస్తున్నామని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

తమ ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం ఇకనైనా ఆపాలని ఆమె బిఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావుకు సూచించారు. ఫుడ్ పాయిజన్‌తో అనారోగ్యం బారిన పడిన విద్యార్ధులను ప్రభుత్వం పట్టించుకోలేదన్న హరీష్ రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఫుడ్ పాయిజన్ ఘటన జరిగిన వెంటనే తమ ప్రభుత్వం తక్షణం స్పందించిందని మంత్రి సీతక్క తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం ప్రభుత్వం అందించిందని గుర్తు చేసారు. తానే స్వయంగా ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఐటీడీఓ పీవో ఖుష్బూ గుప్తా లతో సమన్వయం చేసుకుంటూ విద్యార్దులకు ఎలాంటి అపాయం జరగకుండా తగు చర్యలు చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న సీతక్క ఇలాంటి ఘటనలు జరగకుండా హెల్త్ మానిటరింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆ ప్రకటనలో సీతక్క తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News