Sunday, December 29, 2024

జమ్మూకశ్మీర్ బనీహాల్‌లో మంచులో చిక్కుకున్న పర్యాటకులు

- Advertisement -
- Advertisement -

కశ్మీర్‌లో విపరీతంగా మంచుకురుస్తుండడం వల్ల అనేక మంది పర్యాటకులు మార్గమధ్యంలోనే చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారు. కశ్మీర్‌లోని నవయుగ్ సొరంగంలోనైతే కొందరు తమ బాధను మరిచిపోయేందుకు క్రికెట్ ఆడుతున్నారు. నవయుగ్ సొరంగం రాంబన్ జిల్లాలోని బనీహాల్ పట్టణాన్ని అనంత్‌నాగ్ జిల్లాలోని ఖాజీగుండ్‌ను కలుపుతుంది. జమ్మూకశ్మీర్ జాతీయ రహదారిలో విపరీతంగా మంచు కురుస్తుండడంతో వందలాది మంది చిక్కుకుపోయారు. రహదారి ఎప్పుడు తెరుచుకుంటుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ దృశ్యం తాలూకు వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

రహదారిని తెరిపించేందుకు అధికారులు శనివారం మెషినరీలను, మనుషులను కోరుతున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి మంచు విపరీతంగా కురుస్తోందక్కడ. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పరిస్థితిని అంచనా వేసేందుకు రాంబన్ డిప్యూటీ కమిషనర్ బషీర్‌ఉల్‌హఖ్ చౌదరి, సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ కుల్‌బీర్ సింగ్‌తో కలిసి బనీహాల్‌కు వెళ్లారు. ముంబై నుంచి కశ్మీర్‌కు వెళ్లిన కొత్త పెళ్లి జంట తమ వాహనంలోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక పంజాబ్‌లోని సంగ్రూర్, మధ్యప్రదేశ్ నుంచి వెళ్లిన పర్యాటకులు కశ్మీర్‌లో చిక్కుకుపోయి ఉన్నారు. అనేక మంది కొత్త సంవత్సరం(న్యూ ఇయర్)ను కశ్మీర్‌లో వేడుక చేసుకుందామని వెళ్లిన వారే. కానీ వారి పాలిట హిమపాతం పీడకలలా తయారయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News