* మైలారం గ్రామానికి సమీపంలోని చెరువులో విష ప్రయోగం
* వేల సంఖ్యలో చేపలు మృతి
* విష ప్రయోగంతోనే చేపలు మృత్యువాత పడుతున్నాయని మత్ససహకార సంఘం సభ్యుల ఆరోపణలు
* ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామ మత్స్యసహకార సంఘం సభ్యులు
* చేపల మృతితో పోలీసులకు పిర్యాధు చేసిన మత్స్యసహకార సంఘం సభ్యులు
* ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
దోమ : వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని మైలారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి సమీపంలోని కొర్రెన్గుల చెరువులో విషప్రయోగం జరిగింది. గత మూడు రోజులుగా చెరువులో వేల సంఖ్యలో చేపలు మృతి చెందుతున్నాయని గ్రామానికి చెందిన మత్స్యసహకార సంఘం సభ్యులు వాపోతున్నారు. చెరువు పరిధిలో ఎక్కడ చూసిన చేపలే మృత్యువాత పడుతు దర్శనం ఇస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స కారులకు అందించిన ఉచిత చేప పిల్లల్లో భాగంగా గ్రామానికి చెందిన మత్స కారులకు కుడా 40 వేల చేప పిల్లలను అందించారని, దాంతోపాటు గ్రామ మత్ససహకార సంఘం ఆధ్వర్యంలో దాదాపు చెరువులో రూ. 3 లక్షల పెట్టుబడితో చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువులో వదిలామని సభ్యులు వాపోతున్నారు.
వదిలిన చేప పిల్లలు పూర్తి స్థాయిలో విష వాయుతోనే మరణించిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై గ్రామ మత్స్యసహకార సంఘం సంఘం సభ్యులమందరం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని సంఘం సభ్యులు పేర్కోన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు తమ చెరువులో విషవాయువు ప్రయోగించి ఉండడం వలనే, చెరువులో ఉన్న చేప పిల్లలు పూర్తిగా మరణించి పోతున్నాయని, దీంతో తాము భారీ ఎత్తున్న నష్టపోతున్నామని వాపోతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేసి ఆదుకోవాలని మత్స్యసహకార సంఘం సభ్యులు కోరుతున్నారు.