Monday, December 23, 2024

నకిలీ రిపోర్టర్ల కోసం గాలింపు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: భవనం నిర్మిస్తున్న వ్యక్తిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన నలుగురు నకిలీ విలేకరుల కోసం రెండు పోలీస్ బృందాలు వెతుకుతున్నాయి. పోలీసుల కథనం ప్రకారం….నగరంలోని శ్రీనగర్ కాలనీ, కమలాపురికాలనీకి చెందిన మనీష్ అనే వ్యాపారి భవనం నిర్మిస్తుండగా నలుగురు డబ్బులు ఇవ్వాలని వేధింపులకు గురిచేశారు. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కిరణ్, శ్రీనివాస్, విజయ్, రవీందర్‌పై కేసు నమోదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసినప్పటి నుంచి నలుగురు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు వెస్ట్‌జోన్ డిసిపి రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కాగా, వీరిపై మరో నలుగురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వీరిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. నలుగురు నకిలీ రిపోర్టర్లపై మరో నాలుగు కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News