Wednesday, January 22, 2025

వేటకు వెళ్లి రాళ్ల సందులో ఇరుక్కున్న వేటగాడు…

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/కామారెడ్డి: వేటకు వెళ్లి నట్టఅడవిలో బండరాళ్ల మధ్యలో ఇరుక్కుని వేటగాడు నరకయాతన పడుతున్న ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట శివారు అటవీ ప్రాంతంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడ రాజు అనేవ్యక్తి అటవీప్రాంతానికి షికారుకు వెళ్లాడు. రాజు జేబులో నుంచి ఫోన్ పడిపోవడంతో బండ రాళ్ల మధ్య పడిపోయింది. ఫోన్ తీసేందుకు వెళ్లి రాళ్ల మధ్యలో ఇరుక్కున్నాడు. పెద్ద బండరాళ్ల మధ్యలో ఇరుక్కుని 24 గంటల నుండి రాజు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న గ్రామస్తులు మండల అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని జెసిబి సహాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాళ్లకింద ఇరుక్కున రాజును తీయడానికి బండరాళ్లను జెసిబితో తొలగిస్తున్నారు. రెండు కాళ్లు చేతి మాత్రమే బయటకు కనిపిస్తున్నాయి. తల నుంచి మోకాళ్ల వరకు లోపల వైపు ఉన్నాయి. ఎఎస్ పి అన్యోన్య ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలను సమీక్షిస్తున్నారు. వేటగాడికి ఒఆర్ఎస్, ద్రవాలు పంపిస్తున్నారు. రాజుకు భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News