Tuesday, January 21, 2025

చిరుతను చంపి వండుకొని తిన్న వేటగాళ్లు… అరెస్టు

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఉచ్చులో పడిన చిరుతను వేటగాళ్లు చంపి కూర వండుకొని తిన్న సంఘటన ఒడిశాలోని నౌపడా జిల్లాలో జరిగింది. పోలీసులు వేటగాళ్లను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. దియోధర గ్రామంలో నవంబర్ 15న అడవి పందుల కోసం వేటగాళ్లు ఉచ్చులు బిగించారు. దీంతో ఆ ఉచ్చులలో చిరుత పడడంతో దానిని చంపేసి ముక్కలు ముక్కలు నరికి వేటగాళ్లు పోగులు వేసుకొని పంచుకున్నారు.

అనంతరం చిరుత కూరను వండుకొని తిన్నారు. ఈ విషయం బయటకు తెలియడంతో అటవీ శాఖ అధికారులు నిందితుల ఇళ్లపై దాడులు చేసి చిరుత మాంసం, కూరను స్వాధీనం చేసుకొని ల్యాబ్‌కు పంపారు. అటవీ జంతు సంరక్షణ చట్టం కేసు నమోదు చేసి అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఫారెస్ట్ అధికారి సుశాంత నందా తెలిపారు. చిరుత వండు కొని తినడం అనాగరిక చర్య అని నందా మండిపడ్డారు. క్రూర జంతువులను చంపి తినడం తాను ఎప్పుడూ చూడ లేదని, ఈ విషయం తెలియగానే షాక్ గురయ్యానని వివరణ ఇచ్చారు. ఇలాంటి వాళ్లను సంఘ బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News