Monday, January 20, 2025

ఫ్లోరిడా తీరానికి ఇవాలియా తుపాన్ ముప్పు

- Advertisement -
- Advertisement -

సెడార్ కీ : అమెరికాలోని ఫ్లోరిడా పశ్చిమ తీరానికి హరికేన్ ఇడాలియా ముప్పు తలెత్తింది. తుపాన్‌గా మారింది. ఇది తీవ్రస్థాయిదని పేర్కొంటూ కేటగిరి 3 తుపాన్ హెచ్చరికలు వెలువరించారు. తక్కువ జనసమ్మర్థపు బిగ్‌బెండ్ ప్రాంతంలో హరికేన్ తాకిడి ఉండటంతో ప్రాణనష్టం లేదని వెల్లడైంది. అయితే ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ లేని విధంగా భీకర తుపాన్ గాలులు కమ్ముకోవడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితిలో ప్రజలు భయపడుతున్నారు. బ్లూమూన్ దశలో ఏర్పడ్డ తుపాన్‌తో భారీ నష్టం వాటిల్లుతుందని భయపడుతున్నారు. కుండపోత వర్షాలు, తీరం వెంబడి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలతో పరిస్థితి భీకరంగా మారింది.

కాగా తీర ప్రాంతంలో ఉండే ఫ్లోరిడా ప్రజలు ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరికలు వెలువరించారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో జలాలలో కేంద్రీకృతం అయిన తుపాన్ భీకర స్థాయిలోనే ఫ్లోరిడాను తాకుతుందని విశ్లేషిస్తున్నారు. తుపాన్ తాకిడితో కొన్ని చోట్ల సముద్రపు అలలు ఏకంగా 15 అడుగులు ( నాలుగున్నర మీటర్లు) వరకూ ఎగిసిపడే వీలుంది. సెడార్ కీ ప్రాంతంలోని అత్యంత పురాతనమైన ఐలాండ్ హోటల్ ఓనర్ ఆండి బైర్ స్పందిస్తూ తన ఈ ఇంటిని కాపాడుకోవల్సి ఉందని తెలిపారు. కాగా ఇక్కడికి తరలివచ్చిన టూరిస్టులు తుపాన్ హెచ్చరికలను ఖాతరు చేయకుండా అక్కడనే ఉండిపోవడం అధికారులకు తలనొప్పిగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News