Sunday, January 19, 2025

ఆసియా సంపన్న సిటీ జాబితాలో హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

ఆసియాలోనే బిలియనీర్ల క్యాపిటల్‌గా ముంబై మహానగరం నిలిచింది. భారతదేశపు వాణిజ్య రాజధానిగా ముంబైకి పేరుంది. ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో అత్యంత సంపన్నుల స్థావరం జాబితాలో ముంబై ప్రస్తుతం బీజింగ్‌ను దాటేసింది. 2024 హురూన్ ఇండియా రిచ్ లిస్టు క్రమంలో ఇప్పుడు ముంబై తొలి స్థానంలో ఉండగా తరువాతి స్థానంలో న్యూఢిల్లీ, హైదరాబాద్ నిలిచాయి. ముంబైలో బిలియనీర్ల సంఖ్య ఇప్పుడు మొత్తం 386కు చేరింది. ఢిల్లీలో బిలియనీర్ల సంఖ్య 18 మంది కొత్త పేర్లతో 217కు చేరింది. కాగా హైదరాబాద్ ఈ విషయంలో తొలిసారి బెంగళూరును దాటేసింది.

సంపన్నుల జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. ఇక్కడ కొత్తగా 17 మంది ఈ జాబితాలో చేరడంతో మొత్తం బిలియనీర్ల సంఖ్య 104 అయింది. ఇంతకు ముందు బెంగళూరు మూడో స్థానంలో ఉండగా హైదరాబాద్ చెక్‌పెట్టింది. ముంబై బిలియనీర్ల సంఖ్యతో ఈ నగరంలోని బిలియనీర్ల మొత్తం సంపద 445 బిలియన్లకు చేరింది. ఇక ఆసియాలో నెంబర్ 1 బిలియనీరు సిటి అయిన ముంబై ప్రపంచ వ్యాప్త జాబితాలో చూస్తే 3వ స్థానంలో ఉంది. తొలి స్థానంలో న్యూయార్క్, రెండో స్థానంలో లండన్ ఉంది. మూడవ స్థానంలో ముంబై నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News